telugudanam.co.in

      telugudanam.co.in

   

ఏకాగ్రత

"వింటే భారతం వినాలి. తింటే గారెలే తినాల". అనే సామెత మీరు ఎప్పుడైనా విన్నారా? తినటానికి గారెలు ఎంత రుచిగా ఉంటాయో, వినటానికి భారతం అంత బాగా ఉంటుందని దాని భావం. భారతంలో కౌరవులు, పాండవుల కథ ఉన్నది.

ధృతరాష్ట్రుడు పుట్టడమే గుడ్దివాడుగా పుట్టాడు. ఆయనకు నూరుగురు కొడుకులు. వాళ్ళందరినీ కలిపి "కౌరవులు" అంటారు. పాండు రాజుకు అయిదుగురు కొడుకులు. వాళ్ళందరిని కలిపి "పాండవులు" అంటారు. పాండవులలో పెద్దవాడు ధర్మరాజు. మిగిలిన వాళ్ల పేర్లు వరుసగా భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. పాండవులు చిన్నవాళ్లగా ఉన్నప్పుడే వాళ్ల తండ్రి చనిపోయినాడు. అందువల్ల వాళ్ళు కూడ కౌరవులతో కలసి ధృతరాష్ట్రుని వద్దనే పెరుగుతున్నారు. ద్రోణాచార్యుడు అనే అయన వాళ్లకు విలువిద్యను నేర్పుతున్నాడు. విలువిద్య అంటే బాణాలు ఎట్లా వేయాలో నేర్పే విద్య.

యుద్ధాలలో వీరులు బాణాల దెబ్బలు, కత్తులు మొదలైన ఆయుధాల దెబ్బలు శరీరానికి తగలకుండా ఉక్కుతో చేసిన చొక్కాల వంటివి తొడగుకుంటారు. వాటిని "కవచాలు" అంటారు. ఒక్కొక్కప్పుడు బాణం వదలిన వేగానికి, బాణపు ములికి పదునుకు ఉక్కు కవచం కూడా చీలి, శరీరంలో బాణం నాటుకుంటుంది. బాణాన్ని కావలసినంత వేగంగా వదలటం నేర్చుకోవాలి. సాధన చేయాలి. దీనినే విలు విద్యను నేర్పటం అంటారు.

కౌరవ, పాండవులకు విలువిద్యను నేర్పటం పూర్తి అయింది. ద్రోణాచార్యుడు వాళ్ళకు ఒక పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. అయన ఒక పక్షి బొమ్మను తయారు చేయించాడు. దానిని ఒక చెట్టు చివరు కొమ్మకు కట్టించాడు. ఆయన శిష్యులను అందరిని వెంటపెట్టుకొని ఆ చెట్టు వద్దకు తీసుకొని వెళ్ళాడు. పక్షి బొమ్మను చూపించాడు. ఆ చెట్టుకు కొంచం దూరంలో నేల మీద ఒక గీత గీచాడు. తరువాత ఆయన శిష్యులతో ఇట్లా అన్నాడు. మీరు మీ మి విల్లులను ఎక్కు పెట్టి సిద్దంగా ఉండండి. నేను ఒక్కొక్కరిని పిలుస్తాను. నేను పిలిచినవాడు వచ్చి ఈ గీత మీద నిల్చోని, నేను చెప్పినప్పుడు బాణంతో ఆ పక్షి తల తెగగొట్టాలి. అన్నాడు.

ముందుగా ధర్మరాజును పిలిచాడు. ఆయన వచ్చి గీత మీద నిలబడ్డ తర్వాత "వింట బాణాన్ని సందించి గురి చూసుకో" అన్నాడు. ధర్మరాజు బాణాన్ని సందించాడు. అప్పుడు ద్రోణుడు, "నాయన నీకు ఆ పక్షి కనపడుతుందా"? అని అడిగాడు. ధర్మరాజు "కనపడుతున్నది" అన్నాడు. "చెట్టు మ్రాను కనపడుతుందా అన్నాడు"? "కనపడుతున్నది అన్నాడు." "నీకు నేను, నీ సోదరులు, మేమందరం కనపడుతున్నామా?" అని అడుగగా ఆ పక్షితో బాటే మీరందరూ కనబడుతున్నారు" అన్నాడు ధర్మరాజు. అప్పుడు ద్రోణుడు "నీ చూపు గురి మీద నిలువలేదు. నీ దృష్టి చెదిరింది నీవు ఆ పక్షి తలను కొట్టలేవు వెళ్ళిపో" అన్నాడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: