telugudanam.co.in

      telugudanam.co.in

   

ప్రణాళిక

మన రోజువారీ కార్యకలాపాలలో ప్రణాళిక అన్నది చాలా ముఖ్యమైనది. దీనికి మొదటి స్థానం ఇవ్వాలి. మనం చాలా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. ముఖ్యంగా మన కోరికలను, లక్ష్యాలను సాధించాలనుకున్నప్పుడు బాగా ముందుగానే ప్రణాళికను తయారుచేసుకోవాలి. మన భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి ప్రణాళిక అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రణాళిక మనవద్ద ఉంటే వనరులను, డబ్బు, సరుకులను, సమయాన్ని తమ గరిష్ట పరిమితివరకు ఎంతగా వాడుకోగలమో తెలియజేసే అవగాహనకు అవకాశం ఇస్తుంది. వేగం, కంప్యూటర్లు మొదలైన అత్యాధునిక సాధనాల ఈ యుగంలో సమయం అన్నది అతి అవసరం అయిన వనరుగా తయారయింది. ఇటువంటి పరిస్థితులలో ప్రణాళిక అన్నది మరింత ముఖ్యమైనదిగా తయారయింది.

విషయం తెలిసిన నిపుణులకు వారికి ఎంత పని కేటాయించాలి అన్న విషయాలను అర్ధం చేసుకోవడానికి ప్రణాళిక అన్నది చాలా ఉపయోగపడుతుంది. పోటీ రోజు రోజుకూ ఎక్కువ అవుతున్న ఈ రోజుల్లో ప్రణాళికను తయారుచేసుకోలేని వ్యక్తికి ప్రగతిని సాధించే అవకాశాలు బొత్తిగా ఉండవు. మనం ఆర్ధిక ప్రణాళిక, బడ్జెట్‌కు సంబంధించిన ప్రణాళిక, సుదూర భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక, ఇలా ఎన్నో ప్రణాళికలను గురించి విన్నాం. చాలా విస్తృతమైన రకాలతో కూడిన ప్రణాళికలు ఉన్నాయి.ఇవి కొంతవరకు తక్కువ సమయంలో లాభాలను ఇచ్చేవి అయితే మరికొన్ని చాలా సంవత్సరాల తరువాత లాభాల్ని ఆర్జించిపెట్టే ప్రణాళికలుగా ఉంటాయి. సుదీర్ఘ కీలపు ప్రణాళిక కొన్ని సందర్భాలలో 20 సంవత్సరాల వరకు కూడా పొడిగింపబడివుంటుంది. ఉదాహరణకు కొన్ని పెద్ద పెద్ద నగరాలకు తాగునీరును తీసుకువచ్చే ప్రణాళికను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారి తెలుగుగంగ ప్రాజెక్టు భూగర్భ సొరంగ రైలు మార్గాన్ని కోల్కతాలోని మెట్రో రైల్వే ప్రాజెక్టును, లేదా మన దేశపు రాష్ట్రాలలో కుటుంబ నియంత్రణ ప్రాజెక్టును అమలుపరచడం మొదలైనవాటిని తీసుకోవచ్చును.

గృహిణి ప్రతిరోజు ఒక ప్రణాళిక - పొద్దున పూట తినడానికీ, మధ్యాహ్నం భోజనానికీ, రాత్రి భోజనానికీ ఏమి చేయాలి, ఒక సంవత్సరంలో వచ్చే పండుగలకు ఎంత ఖర్చు చేయాలి, కొన్ని సంవత్సరాల తర్వాత ఇంట్లో జరిగే పెండ్లి, తీర్థయాత్రలు, ఇతర ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులను ఎలా భరించాలి మొదలైన విషయాలకు సంబంచించిన ప్రణాళికను తయారుచేసుకుంటుంది. రైల్వే వారు, విమాన నిలయంలో పనిచేసేవారు, గంట గంటకూ వచ్చే లేదా బయల్దేరే వాటిని ఇలా రప్పించాలి ఇలా గమ్యస్థానానికి పంపించాలి అన్న విషయంగా ఒక ప్రణాళికను కలిగివుంటారు. రైల్వే టైం టేబెల్, విమానాల రాకపోకల సూచిక మొదలైనవి వారి ప్రణాళిక అంతర్భాగమైన దస్తావేజులను తెలియజేస్తాయి. ప్రణాళికకు కార్యకలాపాలతో ముడిపడి వున్న వ్యక్తుల సహాయసహకారాల అవసరం ఉంటుంది. సమగ్రమైన ప్రణాళిక లేని పక్షంలో ప్రణాళిక హాస్యాస్పదంగా తయారవుతుంది. ప్రణాళిక అవసరం లేని చిన్న పని అంటూ ఈ ప్రపంచంలో ఏదీలేదు. సినిమా హాలులో ఒక సినిమాను చూడాలన్నా కూడా దానికొక ప్రణాళిక అవసరం ఉంటుంది. దీనిని ముందుగానే తయారుచేసుకోవాల్సి వుంటుంది. మన ప్రణాళికలు వాస్తవమైనవిగా మనదగ్గరున్న వనరుల సహాయంతో గమ్యం చేరడం సంభవమైనవిగా ఉండాలి. లేని పక్షంలో మొత్తం ప్రణాళిక ఒక గొంతెమ్మ కోరికగా లేదా పగటికలలాగా తయారవుతుంది.

రోం నగర నిర్మాణం ఒక్క రోజులో జరగలేదు' అన్న సామెత సాధించడానికి ప్రణాళిక ఎంత అవసరం ఎంతగా ఉన్నదన్న విషయాన్నీ దాని ప్రాముఖ్యతనూ తెలియజేస్తుంది. గొప్పగా సాధించినవారు ప్రణాళికను గొప్పగా తయారుచేసుకున్న వారిగా ఉంటారు. ఒకప్పటి మైసూరు సంస్థానం ఇప్పుడు కర్ణాటకలో దివానుగా పనిచేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇంజనీరింగుతోపాటు రాజనీతి దురంధరుడుని గురించి విన్నాం. ఇతడే మైసూరులోని కృష్ణ రాజసాగర్ కావేరి నదిపైన ఆనకట్టను తీర్చిదిద్దాడు. చాలా వివరణాత్మకమైన చిన్న చిన్న విషయాలని కూడా వదిలివేయకుండా ప్రణాళికను తయారుచేయడంలో దిట్టగా ఇతడు పేరుపొందాడు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: