telugudanam.co.in

      telugudanam.co.in

   

చిన్నతరహా పరిశ్రమలు

చిన్నతరహా పరిశ్రమల నిర్వచనం మారిన తరువాత కొన్నిసూచనలు జారీ అయినవి - అవి:

  1. నిర్వచనం మారకముందే చిన్న పరిశ్రమలు గానీ వాటికి నిర్దేశించిన పెట్టుబడి పరిమితులను దాటి ఉంటే, అలాంటి పరిశ్రమలను సవరించిన నిర్వచనం ప్రకారం సవరించిన పెట్టుబడి పరిమితుల్లో ఉంటే వాటిని చిన్న పరిశ్రమలుగా, అనుబంధ పరిశ్రమలుగా గుర్తిస్తారు.
  2. నోటిఫికేషన్ తేదికి ముందుగానే అప్పటి పెట్టుబడి పరిధి అధిగమించి, క్యార్ ఆర్ బిజినెస్ లైసెన్స్‌కు దరఖాస్తు చేసినా ప్రస్తుతం హెచ్చించిన పెట్టుబడి పరిమితి లోపల ఉంటే ఆ లైసెన్సు అవసరం లేదు. వారి సి.ఒ.బి. దరఖాస్తులపై ఎటువంటి చర్య తీసుకోరు. వారిని చిన్నతరహా అనుబంధ పరిశ్రమలుగానే పరిగణిస్తారు.

ప్లాంటు యంత్రాల విలువకట్టే విషయంలో అప్పుడప్పుడు భారత ప్రభుత్వ డెవలప్‌మెంట్ కమిషనర్ సవివరమైన ఆదేశాలు జారీ చేస్తారు. అలాంటి సూచనలు కొన్ని:

  1. ప్లాంటు, యంత్రాలకు స్వంతదారుడు కొనుగోలు చేసినపుడు చెల్లించిన మొత్తాన్నే పరిగణలోకి తీసుకుంటారు.
  2. పనిముట్లు, జిక్స్ - డైస్, మౌట్స్ వంటి పరికరాలు, వినియోగం చేసే ఇతర సామగ్రి మూల్యంపై మినహాయింపు ఇస్తారు.
  3. ప్లాంటు, యంత్రాల స్ధాపనకు సంబంధించిన ఖర్చు కూడా మినహాయిస్తారు.
  4. ఒకవేళ యంత్రాలు దిగుమతి చేసుకున్నట్లయితే దిగుమతి సుంకం, షిప్పింగ్ ఛార్జీలు, అమ్మకపు పన్నులు మినహాయించరు. కానీ ఈ క్రింది ఖర్చులు మినహాయిస్తారు.
  5. ఎ) పోర్టునుండి కర్మాగారపు స్ధలానికి రవాణాసౌకర్యాలు వంటి చిన్నఖర్చులు.
    బి) పోర్టు వద్ద కాలాతీత పరిహార రుసుము.
    సి) యంత్రాలను దిగుమతి చేసుకొనే హక్కులను పొందడానికి చెల్లించిన ప్రీమియం.

  6. విద్యుదుత్పత్తి చేసే జనరేటర్ ఖరీదు మినహాయింపు.
  7. ఎలక్ట్రిక్ మోటార్ల మూల్యాన్ని కూడా మినహాయిస్తారు.
  8. మనదేశంలోనే తయారైన యంత్రాలను, ఆ స్ధలం నుండి కర్మాగారానికి తరలించడానికి అయ్యే రవాణా ఖర్చులు మినహాయిస్తారు. కానీ అమ్మకపు పన్ను, ఎక్సైజు వంటి వాటిని మినహాయించరు.
  9. శీతల యంత్ర గిడ్డంగుల్లో అమర్చే స్టోరేజి అరలు మినహాయించవచ్చు.
  10. ప్లాంటు మరియు యంత్రాలు అమర్చడానికి సాంకేతికవిజ్ఞానం కొనుగోలుకు చెల్లించిన ఖర్చులు మినహాయిస్తారు.
  11. కాలుష్య నివారణ పరికరాలకు సంబంధించిన ఖర్చు కలుపుకోకూడదు.
  12. విద్యుచ్ఛక్తిని ప్లాంటు యంత్రాల వరకు తెచ్చుకోవడానికి కేబుల్‌ను శాశ్వతంగా చేసిన వైరింగ్ మూల్యాన్ని ప్లాంటు యంత్రాల పెట్టుబడిని విలువ కట్టే సందర్భంలో తప్పనిసరిగా చేర్చుకోవాలి.
  13. వాసాల కోసం, స్తంభాల కోసం ఏర్పాటు చేసిన వైరింగ్ ఖర్చులపై మినహాయింపు ఇస్తారు.
  14. ఉత్పత్తి కార్యక్రమం కోసం ఉపయోగించబడిన ఎలక్ట్రికల్ ఏర్పాట్లకు సంబందించిన, నీటి సరఫరా ఏర్పాట్లకు సంబంధించిన ఖర్చు చేర్చుకుంటారు.
  15. ఉత్పత్తి సమయంలో కావలసిన పరీక్షలు చేయడానికి, నాణ్యతను చేర్చుకుంటారు. కానీ కేవలం అది కాకుండా పరిశీలన, అభివృద్ధి కార్యక్రమాల కోసం ఉపయోగించిన పరికరాల ఖర్చుని మినహాయిస్తారు.
  16. ద్రవ రూపంలో ఉన్న ముడి సరుకు లేక తయారైన సరుకు నిల్వచేయాటానికి ఉపయోగించే స్టోరేజి చేర్చుకోరు. అయితే ఆ ట్యాంకులు నిల్వ చేయటానికి కాదు మా ప్లాంటులో అంతర్భాగంగా ఉంటే ఆ ఖర్చును చేర్చుకుంటారు.

మరిన్ని సూచనలకు, వివరాలకు పరిశ్రమల శాఖను సంప్రదించవచ్చును.


రిజిస్ట్రేషన్‌లు - లైసెన్సులు - క్లియరెన్సులు

చిన్నతరహా పరిశ్రమల్లో పెట్టుబడి తక్కువగా ఉంటుంది. కనుక వీటికి లైసెన్సు అవసరం లేకుండానే స్థాపించవచ్చును. అంటే ఈ విభాగం స్వతంత్రంగా ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ను స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారితో చేయాలనే చట్ట నిబంధన లేదు. కానీ రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మరిన్ని ఋణాలు, పథకాలు పొందవచ్చు. చిన్న పరిశ్రమల రిజిస్ట్రేషన్ విధానం చాలా సులభం.

రిజిస్ట్రేషన్: స్టేట్ డెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ మరియు డిస్ట్రిక్ట్ ఇండస్టీస్ వారి నుండి అప్లికేషన్ పొందవచ్చు. సరైన దరఖాస్తులను జిల్లా పరిశ్రమల అధికారి, రాష్ట్ర డైరెక్టొరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు పంపుతారు. ఇది రెండు దశల్లో ఇవ్వబడుతుంది.

ఎ) ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ బి) పర్మినెంటు రిజిస్ట్రేషన్


ఎ) ప్రొవిజినల్ రిజిస్ట్రెషన్ అవసరం ఏమిటి?

  1. ఇండస్ట్రియల్ ఎస్టేట్ షెడ్‌కి - అభివృద్ధి చెందిన ప్రదేశాల్లోకి వెళ్ళటానికి, షెడ్డు లేదా పరిశ్రమకు అవసరమయ్యే భవన నిర్మాణానికి ప్రొవిజినల రిజిస్ట్రేషన్ అవసరం.
  2. కార్పొరేషన్, మునిసిపాలిటీ, పంచాయితీ వంటి స్థానిక ప్రభుత్వాలతో భవన నిర్మాణానికి కావలసిన అనుమతి పొందడానికి ఈ యంత్రాంగానికే లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవటానికి.
  3. కావలసిన నిర్వహాణా వ్యయం (వర్కింగ్ క్యాపిటల్) బ్యాంకుల ద్వారా సంపాదించుకోవటానికి.
  4. జాతీయ చిన్న పరిశ్రమల కార్పొరేషన్, చిన్న పరిశ్రమల అభివృద్ధి సంస్థల ద్వారా పరిశ్రమకు కావలసిన యంత్రాలను హైర్‌పర్చేజ్‌పై కొనుగోలు చేయడానికి, తెప్పించుకోవడానికి.
  5. విద్యుత్తు మరియు మంచినీటి సౌకర్యం కోసం.
  6. నిధుల సమీకరణలో ' రాష్ట్ర ఆర్ధిక సంస్థ ' (ఎస్.ఎఫ్.సి), జాతీయ బ్యాంకులు, ఇతర ఆర్ధిక సంస్ధల నుండి ప్రాజెక్టు రిపోర్టు ఆధారంగా కావలసిన మేరకు సహాయం పొందటానికి.
  7. సేల్స్‌టాక్స్, ఎక్సైజ్ రిజిస్ట్రేషన్, ముడిసరుకు, క్యాపిటల గూడ్సుల కోసం, దిగుమతి లైసెన్సు పొందటానికి ఈ ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ ఎంతో అవసరం.

ముందు ఈ తాత్కాలిక రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇది ఒక సంవత్సరం పాటు పనిచేస్తుంది. తరువాత ప్రతి ఆరునెలలకు ఒకసారి చొప్పున నాలుగేళ్ళ వరకూ పొడిగించుకోవచ్చు. పరిశ్రమకు కావలసినవన్నీ అనగా భవనం, యంత్రాల స్థాపన అయిన వారం రోజుల్లోగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. డైరెక్టరేట్ ఆఫ్ ఇండస్ట్రీస్ వారు, వచ్చి యూనిట్ సంతృప్తికరంగా ఉన్నట్లైతే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తారు. రిజిస్ట్రేషన్ కొరకు అప్లికేషన్ లభించకపోయినట్లైతే ఈ దిగువ ప్రొఫార్మాను టైపు చేయించి లేక స్వదస్తూరితో తెల్లకాగితంపై పూర్తిచేసి సంబంధిత అధికారికి పంపవచ్చు.


ప్రొవిజినల్ రిజిస్ట్రేషన్ కొరకు అప్లికేషన్ ప్రొఫార్మా

గుర్తింపు వివరాలు:

  1. పరిశ్రమ పేరు (కొత్తది / నడుస్తున్నది)
  2. పరిశ్రమ అడ్రస్రాష్ట్రం, జిల్లా, మండలం, తాలూకా, మున్సిపాలిటీ / బ్లాకు, టౌను, గ్రామం, పిన్‌కోడ్, ఇంటి నంబరు.
  3. పరిశ్రమ స్వభావం: వస్తువు తయారీ, అమ్మకం, రిపేరింగ్ / స్ర్వీసింగ్ మొదలైన విషయాలు.
  4. తయారు చేసే వస్తువు / ఉత్పత్తుల పేర్లు.
  5. సంవత్సరానికి అవసరమయ్యే విద్యుచ్ఛక్తి (కిలోవాట్లు)
  6. మెషినరీపై పెట్టుబడి అంచనా.
  7. ఖాదీ మధ్యతరహా అయితే ఆ వివరాలు.

రెండవ భాగం:

  1. వస్తువు / ఉత్పత్తి తయారీకి అవసరమయ్యే దేశీయ ముడిసరుకు ఖరీదు.
  2. మెషినరీ సంఖ్య, ఖరీదు.
  3. ఇతర వ్యాపార సంస్ధలతో, యజమాని / భాగస్వాములకు ఏదైనా వ్యాపార సంబంధం కలిగి ఉండటానికి ఆసక్తి ఉన్నదా?

మూడవభాగం:

  1. ఒక సంవత్సరం ఉత్పత్తికి సుమారుగా దిగుమతి కావలసిన ముడిసరుకులు:
  2. వస్తువు పేరు, కావలసిన మొత్తం, ఖరీదు.

  3. తయారు చేయబోయే ఉత్పత్తి పూర్తి వివరాలు.
  4. పరిశ్రమకు కావలసిన స్థల / భవన పరిమాణం
  5. ఉత్పత్తి పారిశ్రామిక వినియోగమా / వినియోగదారుల ఉపయోగార్ధమా?
  6. వస్తువు విలువ (ముడి సరుకు, ఇంధనం, ఉత్పత్తి)
  7. వస్తువు తయారీకి అవసరమయ్యే నిపుణుల సంఖ్య, లభించే అవకాశాలు.
  8. స్థానికంగా / రాష్ట్రంలో వస్తువు తయారీకి గల పోటీ.
  9. వస్తువు తాయారీ పద్ధతికి చెందిన వివరాల పట్టిక.
  10. వస్తువుకు గల డిమాండ్ (స్థానికం / రాష్ట్రం / జాతీయంగా)
  11. భాగస్వాములుంటే ఒప్పందపు డాక్యుమెంట్లు / నియమ నిబంధనలు (పరిశ్రమవి)
  12. యజమాని / భాగస్వాములు వివరాలు / చిరునామా(శాశ్వతంగా).
  13. వారి పాలనా సంబంధ అనుభవం.
  14. పరిశ్రమకు అవసరమయ్యే యంత్ర పంపిణీదారుల హామీ / చిరునామాలు.

బి పర్మినెంట్ రిజిస్ట్రేషన్: పరిశ్రమకు కావలసిన అన్నిరకాల యంత్రాలు, పరికరాలు, నీటి సదుపాయం, విద్యుత్ అన్నీ సమకూర్చుకున్నాక పర్మనెంట్ రిజిస్ట్రేషన్ కొరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. అప్లికేషన్‌తో పాటుగా జతచేయవలసిన పత్రాలు:

  1. లీజ్ డీడ్ లేదా మున్సిపల్ టాక్స్ రసీదు.
  2. పార్టనర్ షిప్ డీడ్ / సర్టిఫికెట్ ఆఫ్ ఇన్‌కార్పొరేషన్.
  3. ఇన్‌కంటాక్స్ ఎసెన్‌మెంటు ఆర్డరు.
  4. సేల్‌టాక్స్ రిజిస్ట్రేషన్.
  5. యంత్రాల కొటేషన్స్ / ముడి సరుకు వసతుల కాగితాలు.
  6. ఎలక్ట్రిసిటీ చార్జీల బిల్లులు.
  7. మార్కెటింగ్ ఆర్డర్స్ పత్రాలు.
  8. షాపు యాక్ట్ లైసెన్స్ లేదా ఫ్యాక్టరీ లైసెన్స్.
  9. సెంట్రల్ ఎక్సైజ్ / డ్రగ్ కంట్రోల్ లైసెన్సు / ఎన్.ఒ.సి. వాటర్ పొల్యూషన్ బోర్డు పేపర్స్ (అవసరమయితే)
  10. మొట్టమొదటి అమ్మకాల సేల్ నోట్స్ / క్యాష మెమోలు.

ఒకసారి ఇచ్చిన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడే పరిస్థితులు:

కొన్ని సందర్భాల్లో ఇవ్వబడిన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడుతుంది.

  1. సంవత్సరం కన్నా మించి పరిశ్రమ మూతబడితే.
  2. సరైన సమాచారం పంపించకపోతే, తప్పుడు సమాచారం ఇస్తుంటే.
  3. సమకూర్చబడిన రా మెటీరియల్స్‌స్ను దుర్వినియోగం చేస్తుంటే రిజిస్ట్రేషన్ రద్దు అగును.

లైసెన్సులు - క్లియరెన్స్లు:

స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీ‌కు లైసెన్సులతో పని లేదు. కానీ కొన్ని ప్రత్యేక ఐటంలకు ఆయా అధికారుల నుండి లైసెన్సు తప్పనిసరిగా పొంది ఉండాలి.

  1. కాలుష్య నియంత్రణ లైసెన్సు కోసం - స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.
  2. మందులు, కాస్మెటిక్స్ తయారీ లైసెన్స్ కోసం - స్టేట్ డ్రగ్ కంట్రోలర్, డ్రగ్ కంట్రోల్ బోర్డు.
  3. సెంట్రల్ ఎక్సైజ్ చట్టం కింద రిజిష్టర్ అయిన పరిశ్రమలు - స్ధానిక సూపరింటెండెంట్, సెంట్రల్ ఎక్సైజ్ (లేదా) సెంట్రల్ ఎక్సైజ్ కలెక్టర్.
  4. వ్యర్ధ పదార్ధాలు, గ్యాస్‌ను వెలువరించే పరిశ్రమలు - డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ శానిటేషన్.
  5. పండ్ల ఉత్పత్తులకు సంబంధించి - డిప్యూటీ డైరెక్టర్, ఫుడ్ అండ్ విజిటబుల్ ప్రిజ్ర్వేషన్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్.
  6. సేల్స్ టాక్స్ లైసెన్స్ - జాయింట్ కమర్షియల్ టాక్స్ ఆఫీసరి.
  7. పార్టనరీ షిప్ ఒప్పందం రిజిస్ట్రేషన్ - ఐ.జి. ఆఫ్ రిజిస్టేషన్.
  8. ఇన్‌కమ్‌ టాక్స్ చెల్లింపు లైసెన్స్ - ప్రాంతీయ ఐ.టి.డి. అసిస్టెంట్ కమీషనర్ / ఐ.జి. ఆఫ్ రిజిస్ట్రేషన్
  9. అనుమతించని స్ధలాలు, పారిశ్రామిక ప్రాంతాలు కానిచోట పని చేయు యూనిట్లకు - కార్పొరేషన్ , మున్సిపాలిటీ, పంచాయితీ నుండి.
  10. విద్యుచ్ఛక్తి లైసెన్స్ - విద్యుత్ బోర్డు.
Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: