telugudanam.co.in

      telugudanam.co.in

   

నేడు రైతుల దినోత్సవం

భారతీయ రైతుల అగ్రనాయకుల్లో ఒకరైన శ్రీ చౌదరి చరణ్‌సింగ్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా అక్టోబర్‌ 22వ తేదీన మనదేశంలో " రైతు దినోత్సవాన్ని " నిర్వహిస్తున్నారు.

రైతులనే వారు ఏ సమాజానికయినా వెన్నెముక లాంటివారు. రైతులు పండించే పంటలపైనే దాదాపుగా మొత్తం సమాజం అంతా ఆధారపడివుంది. వివిధ రకాల పంటలను పండించేదుకే రైతులు, పగలూ-రాత్రీ.

తేడా లేకుండా, ఎండనకా, వాననకా కష్టపడతారు. అయినప్పటికీ వారి జీవన పరిస్థితులు ఏమంత బాగా లేవు. ఇది ఒక బాధాకరమైన విషయం.

మనదేశపు సామాజిక ఆర్ధిక అభివృద్ధి చాలా మేరకు రైతులపైనే ఆధారపడి వుంది. అందువల్ల వారికి సంబంధించిన విద్యకు, ఆరోగ్యానికి ప్రభుత్వం, సమాజం ప్రాధాన్యతను ఇవ్వవలసి వుంటుంది.

ఆధునిక వ్యవసాయ పద్ధతులలో మన రైతులకు తగిన శిక్షణనివ్వడం, విత్తనాలు, ఎరువులు, ఇంకా వ్యవసాయ సంబంధిత పరికరాలు కొనుగోలుకై వారికి రుణాలివ్వడం, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌

విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవడం వంటి పనులలో ప్రభుత్వాలు, సమాజం రైతులకు తగిన చేయూతను అందించాలి. ఈ విషయంలో " రైతుల సహకార సంఘాలు " ఇంకా " రైతుల సహకార ఉద్యమం "

ఒక రెండు మంచి మైలురాళ్ళని చెప్పవచ్చు. ఒక విధంగా రైతులు అందించే సేవలకు మొత్తం సమాజం రుణపడి వుంటుంది. అందుకని వారి సంక్షేమం కోసం సమాజం చేయవలసింది చాలా వుంది. వారి

అమూల్యమైన సేవలకు ఓ చిన్న గుర్తింపుగా ప్రతి ఏటా రైతుల దినోత్సవాన్ని జరుపుకోవడం, కనీసం కొందరు రైతులనైనా సముచితంగా సత్కరించడం జరుగుతోంది.


మూలం : 22-Oct-08, బుధవారం, సాక్షి (ఫ్యామిలీ)

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: