|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వంటలు(కొన్ని)
కావలసిన వస్తువులు:
| గోధుమపిండి |
- |
ఒక కప్పు. |
| పంచదార |
- |
రెండు కప్పులు . |
| యాలకుల పొడి |
- |
ఒక టీ స్పూను. |
| నూనె |
- |
వేయించడానికి చాలినంత. |
తయారు చేసే విధానం:
గోధుమపిండిలో 2 టీ స్పూన్ల నూనె వేసి, సరిపడా నీటితో చపాతి పిండిలా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. వాటికి నూనె రాస్తూ పూరీల్లా వత్తుకుని మధ్యలో కట్ (అర్ధ చంద్రాకారంలో) చేయాలి. చివర్లు తెగకుండా పూరీల మధ్యలో కత్తితో పొడుగ్గా గాట్లు పెట్టుకోవాలి. అన్నీ తయారయ్యాక రెండు చేతులతో వడితిప్పి ఇలాచీ ఆకారంలో చేసుకొని విడిపోకుండా చివర్లు వత్తుకోవాలి. వీటిని నూనెలో దోరగా వేగించుకోవాలి. ఒక పాత్రలో పంచదార పాకం తయారుచేసుకొని, యాలకులపొడి వేసి వేగించిన ఈ పూరీ ఇలాచీలను ఆ పాకంలో ముంచి వెంటనే తీసేయాలి. చల్లారాక తింటే చాలా రుచిగా ఉంటాయి.
కావలసిన వస్తువులు:
| పచ్చి బఠానీ గింజలు |
- |
అరకేజి. |
![]() |
| మైదా |
- |
250 గ్రా. | |
| జీలకర్ర |
- |
10 గ్రా. | |
| ధనియాలు |
- |
10 గ్రా. | |
| కారం |
- |
5 గ్రా. | |
| గరం మసాల |
- |
25 గ్రా. | |
| కొత్తిమీర |
- |
25 గ్రా. | |
| నిమ్మరసం |
- |
3 టేబుల్ స్పూన్లు. | |
| ఉప్పు |
- |
రుచికి సరిపడా. | |
| వేరుశనగ నూనె |
- |
వేగించడానికి తగినంత. |
తయారు చేసే విధానం:
ముందుగా మైదాలో అర టీ స్పూను ఉప్పు, ఒక టీ స్పూను నూనె వేసి నీటితో గట్టి ముద్దలా కలిపి అరగంటపాటు నానబెట్టాలి. పచ్చి బఠానీ గింజల్ని పొట్టు తీసి చేత్తో నలిపి ఒక గిన్నెలో వేయాలి. వీటికి మిగతా పదార్థాలన్నీ కూడా జతచేస్తూ బాగా కలపాలి. మైదా ముద్దలోంచి కొద్దికొద్దిగా పిండి తీసుకుని మధ్యలో బఠానీ మిశ్రమాన్ని పెట్టి బోండాల్లా చేసుకుని కత్తితో చుట్టూ గాట్లు పెట్టుకోవాలి. వీటిని దోరగా వేగించి తీశాక కొద్దిసేపు టిష్యూ పేపర్‌పై ఉంచితే నూనెని పీల్చుకుంటుంది. వేడివేడి పచ్చి బఠానీ బొండాలను టమేటో సాస్‌తో తింటే చాలా రుచిగా ఉంటాయి. బఠానీ బదులు బదులు ఇతర కాయధాన్యాల మిశ్రమమైనా వాడొచ్చు.
కావలసిన వస్తువులు:
| క్యారెట్ |
- |
పావుకిలో. |
![]() |
| బీన్స్ |
- |
పావుకిలో. | |
| బంగాళాదుంపలు |
- |
అరకిలో. | |
| క్యాప్సికమ్ |
- |
పావుకిలో. | |
| కాలీఫ్లవర్ |
- |
పావుకిలో. | |
| ఉల్లిపాయలు |
- |
పావుకిలో. | |
| అల్లంవెల్లుల్లి |
- |
4 టీస్పూన్లు. | |
| పచ్చిమిర్చి |
- |
ఆరు. | |
| కారం |
- |
4 టీస్పూన్లు. | |
| పసుపు |
- |
1 టీస్పూను. | |
| పెరుగు |
- |
అరకిలో. | |
| గరంమసాలా |
- |
5గ్రా. | |
| పచ్చికొబ్బరి |
- |
ఒక కాయ. | |
| గసాలు. |
- |
50గ్రా. | |
| నూనె |
- |
150గ్రా. | |
| ఉప్పు |
- |
50గ్రా. లేదా సరిపడినంత. |
తయారు చేసే విధానం:
కూరగాయలను శుభ్రంచేసి కావలసిన సైజులో ముక్కలుగా తరిగి ఓ ప్లాస్టిక్ కవర్‌లో పెట్టుకోండి. ఓ గిన్నెలో నూనె వేసి ఉల్లిముక్కలు వేసి ఎర్రగా వేయించాలి. తరవాత అల్లంవెల్లుల్లి, కారం, పసుపు వేసి వేయించి నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పెరుగు వేసి ఓ చిన్న స్టీలు డబ్బాలో పెట్టుకోవాలి. పచ్చికొబ్బరి, గసాలూ కలిపి మెత్తగా రుబ్బాలి. అందులో 50గ్రా. ఉప్పు కలిపి కొత్తిమీర కూడా చేర్చి ప్యాక్ చేసుకోవాలి. అనుకున్న చోటుకి వెళ్లాక పొయ్యి వెలిగించి 5 లీటర్ల సైజు గిన్నె పెట్టి రెండున్నర లీటర్ల నీళ్లు పోసి కూరగాయ ముక్కలు, ఉల్లిపాయ మసాలా మిశ్రమం వేసి ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరవాత కొబ్బరి మసాలా కూడా వేసి మరో పది నిమిషాలు ఉడికించి దించాలి. అంతే కూరగాయల పులగం రెడీ.
కావలసిన వస్తువులు:
| పెసరపప్పు |
- |
పావు కిలో. |
![]() |
| ఉల్లిపాయ |
- |
పెద్దది ఒకటి. | |
| పచ్చిమిర్చి |
- |
రెండు. | |
| ఉప్పు |
- |
తగినంత. | |
| పసుపు |
- |
చిటికెడు. | |
| పోపు సామగ్రి |
|
||
| ఎండు మిర్చి |
- |
4. | |
| ఆవాలు |
- |
1/2 టీ స్పూన్. | |
| మినపప్పు |
- |
1 టీ స్పూన్. | |
| జీలకర్ర |
- |
1/4 టీ స్పూన్. | |
| వెల్లుల్లి |
- |
3 రేకలు. | |
| కరివేపాకు |
- |
కొద్దిగా. | |
| కొత్తిమీర |
- |
కొద్దిగా. | |
| నూనె |
- |
తగినంత. | |
| నిమ్మకాయ |
- |
పెద్దది ఒకటి. |
తయారు చేసే విధానం:
పెసర పప్పును మొదట దోరగా వేయించాలి. తగినంత నీరు పోసి ఉడికించాలి. రెండు పొంగులు వచ్చాక ఉల్లిపాయ, పచ్చి మిర్చి ముక్కలు, పసుపు వేసి మెత్తగా ఉడికించి, ఉప్పు వేసి దించి మెత్తగా మెదిపి, బాణలిలో నూనె మరిగాక పైన చెప్పిన పోపు వేయించి పప్పులో కలపాలి. సన్నగా తరిగిన కొత్తిమీర వేయాలి. చివరిగా నిమ్మరం పిండి పప్పులో కలియబెట్టాలి.ఈ పప్పు కూరను గట్టిగా కాకుండా లూజుగా చేసుకోవడం బాగుంటుంది.
వివరణ:
వేపుడు కూరలు ఎక్కువగా తిన్న తర్వాత వచ్చే ఇబ్బందులకు ఈ వంటకం మంచి హితవైనది. ఆకలి బాగా మందగించినప్పుడు ఈ లిక్విడ్ కూరను చేసుకోండి.
కావలసిన వస్తువులు:
| వంకాయలు |
- |
పావు కేజీ. |
![]() |
| జీడిపప్పు |
- |
పావు కేజీ. | |
| ఉప్పు |
- |
తగినంత. | |
| పసుపు |
- |
చిటికెడు. | |
| పోపు సామగ్రి |
|
||
| ఎండిమిర్చి |
- |
4. | |
| ఆవాలు |
- |
అర టీ స్పూన్. | |
| మినప పప్పు |
- |
ఒక టీ స్పూన్. | |
| జీలకర్ర |
- |
పావు టీ స్పూన్. | |
| జీలకర్ర |
- |
పావు టీ స్పూన్. | |
| శనగపప్పు |
- |
ఒక టీ స్పూన్. | |
| కరివేపాకు |
- |
కొద్దిగా. | |
| అల్లం |
- |
చిన్న ముక్క. | |
| పచ్చిమిర్చి |
- |
రెండు. | |
| నూనె |
- |
మూడు టీ స్పూన్లు. | |
| కొత్తమీర |
- |
కొద్దిగా. |
తయారు చేసే విధానం:
ఉప్పు వేసిన నీటిలో తరగిన వంకాయ ముక్కలు వేయాలి. పచ్చి జీడిపప్పు (పిక్కలనుండి తీసినపప్పు) పొట్టు వలచి పెట్టాలి. బాణలిలో నూనే మరిగాక ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, మిగిలిన పోపు వేయించి, అల్లం, పచ్చిమిర్చి ముద్ద వేసి వేగాక, జీడిపప్పు, వంకాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి సన్న సెగలో మూత పెట్టి మగ్గించాలి. ఆఖరున దించే ముందు కొత్తి మీర వేసి దించాలి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 07-04-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in