www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు (కొన్ని)

పాపిడి

కావలసిన వస్తువులు:

పంచదార

-

1 కిలో.

మైదా

-

1/2 కిలో.

నెయ్యి

-

పావు కిలో.

నిమ్మకాయ

 -

అర చెక్క.

నీళ్ళు

-

2 కప్పులు.

తయారుచేసే విధానం

బాగా మందం గల గిన్నెలో పంచదార,  నీళ్ళు, నిమ్మరసం పిండి పొయ్యి మీద పెట్టి పాకం వచ్చేదాకా ఉంచి గిన్నెను దించి పాకాన్ని గరిటెతో చల్లార్చాలి. ఇలా పాకం చల్లారేటప్పుడు ముద్దలా అవుతూ సాగే గుణం కలిగి ఉంటుంది. దీన్ని గరిటెతో పైకి లేపుతూ పైనుంచి పిండిని చల్లుతూ పాకంలో కలిసే విధంగా కలుపుతూ పిండి అయ్యే వరకు చేస్తూ ఉండాలి. దాన్ని నెయ్యి పూసిన పళ్ళెంలో వేసి ఇష్టమైన ఆకృతులలో చేసుకోవచ్చు. పాకంలో కలిపేందుకు పిండిని ముందుగానే నేతిలో కలిపి సన్నని మంటమీద పచ్చివాసన పోయేవరకు వేపి చల్లార్చి సిద్దంగా ఉంచుకోవాలి.

[ వెనుకకు ]

పునుగులు

కావలసిన వస్తువులు:

బియ్యం

-

అర కిలో.

మినపప్పు

-

పావు కిలో.

పచ్చి శనగపప్పు

-

100 గ్రా.

నూనె

-

తగినంత.

ఉల్లిపాయలు

-

2 (సన్నగా తరగాలి).

పచ్చిమిర్చి

-

పది.

అల్లం

-

చిన్నముక్క.

జీలకర్ర

-

1 టీ స్పూను.

ఉప్పు

-

తగినంత.

వంట సోడా

-

పావు టీ స్పూను.

తయారుచేసే విధానం

మినపప్పు, బియ్యం విడివిడిగా ఓ పూట ముందుగా నానబెట్టి ఉంచాలి. నాన బెట్టిన మినపప్పును, బియ్యంను కడిగి మెత్తగా రుబ్బాలి. పచ్చిశనగపప్పును ఓ గంట ముందుగానే నానబెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం సన్నని ముక్కలుగా కోయాలి. రుబ్బుకున్న పిండిలో పచ్చిశనగపప్పు, ఉల్లి, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు, వంటసోడా వేసి గారెలపిండికన్నా కాస్త మెత్తగా కలపాలి. మీడియం సైజులో పిండిముద్దను తీసుకుని గుండ్రంగా చేసి నూనెలో వేసి బాగా వేయించాలి. వీటిని వేడివేడిగా వేరుశనగ పచ్చడితో తింటే బాగుంటాయి. కాస్త పుల్లగా తినాలనుకుంటే పిండిలో అన్నీ వేసి కలిపి ఓ పూట నిల్వ ఉంచి వేస్తే పిండి పులిసి రుచిగా ఉంటాయి. అయితే అజీర్తి ఉన్నవాళ్లకి పులవకుండా ఉంటేనే మంచిది.

[ వెనుకకు ]

అల్లం కొత్తిమీర వంకాయ కూర

కావలసిన వస్తువులు:

వంకాయలు

-

10.

 పచ్చిమిర్చి

-

30 గ్రా.

 అల్లం పేస్ట్

-

20 గ్రా.

ఉల్లిపాయలు (తరిగి)

-

తగినన్ని.

కొత్తిమీర

-

2 కట్టలు.

జీరా

-

10 గ్రా.

రిఫైండ్ ఆయిల్

-

సరిపడినంత.

తయారుచేసే విధానం

ముందుగా పచ్చిమిర్చి, అల్లం, జీరా, కొత్తిమీర మిశ్రమాన్ని రుబ్బి పేస్ట్ తయారుచేసుకోవాలి. వంకాయల్ని మధ్యలోకి చీల్చి కడాయిలో మూడు నిముషాల పాటు నూనెలో వేయించాలి. వంకాయ మధ్యలో రుబ్బి వుంచుకున్న మిశ్రమాన్ని కూర్చాలి. కడాయిలో నూనె వేడిచేసి ఉల్లిపాయలు వేసి వేయించాక వంకాయలు వేసి సన్నని సెగపై ఉడికించాలి. పైన సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.

[ వెనుకకు ]

వెజిటబుల్ కట్‌లెట్

కావలసిన వస్తువులు:

క్యారెట్ (సన్నగా తరిగి)

-

100 గ్రా.

బీన్స్ (సన్నగా తరిగి)

-

100 గ్రా.

కాలిఫ్లవర్ (సన్నగా)

-

100 గ్రా.

ఆలూ గుజ్జు

-

200 గ్రా.

మిర్చిపొడి, ఉప్పు, ఉల్లిపాయలు

-

సరిపడినంత.

అల్లం, వెల్లుల్లి పేస్ట్

-

5 గ్రా.

పసుపు

-

అర టీ స్పూను.

చాట్ మసాలా

-

1 టీ స్పూను.

జీరా పొడి

-

అర టీ స్పూను.

బ్రెడ్‌ పౌడర్

-

సరిపడినంత.

మైదా

-

50 గ్రా.

గుడ్లు

-

2.

రిఫైండ్ ఆయిల్

-

సరిపడినంత.

తయారుచేసే విధానం

కడాయిలో ఆయిల్ వేడిచేసి తరిగిన ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేయించాలి. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ వేసి ఐదు నిమిషాల తర్వాత పసుపు, మిర్చిపొడి, ధనియాల పొడి, జీర పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి సన్నటి సెగపై ఉడకనివ్వాలి. ఆలూ గుజ్జు, చాట్ మసాలా, తురిమిన కొత్తిమీర వరుసగా వేసి కొద్ది సేపయ్యాక ఉప్పు, కొద్దిగా మైదా, బ్రెడ్ పౌడర్ వేసి మిశ్రమాన్ని కలపాలి. మిశ్రమాన్ని డైమండ్ షేపులో చేసి మైదాపొడితో అద్ది ఆ పైన గుడ్డుసొనలో అద్ది మళ్ళీ బ్రెడ్ పౌడర్‌తో అద్ది దోరగా వేయించాలి. ఏదైనా సాస్ తో కలిపి ఈ కట్‌లెట్‌ల రుచిని ఆస్వాదించండి.

[ వెనుకకు ]

మసాలా పకోడీ

కావలసిన వస్తువులు:

శనగపిండి

-

 1/4 కిలో.

బియ్యప్పిండి

-

3/4 కిలో.

ఉల్లిపాయ చీలికలు

-

ఒకటిన్నర (1 1/2)కిలో.

నూనె

-

తగినంత.

కరివేపాకు(వేయించినది)

-

1కప్పు.

పచ్చిమిర్చి(సన్నగా తరిగినది)

-

అర కప్పు.

కొత్తిమీర తురుము

-

అర కప్పు.

అల్లంవెల్లుల్లిగుజ్జు

-

2 టీ స్పూన్లు.

కారం

-

2 టీ స్పూన్లు.

గరం మసాలా

-

1 టీ స్పూను.

ఉప్పు

-

తగినంత.

బేకింగ్ పౌడర్

-

పావు టీ స్పూను.

తయారుచేసే విధానం

ఉల్లిపాయలు చీలికల్లా కోయాలి. ఈ ముక్కల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తురుము, ఉప్పు, కారం, మసాలా పొడి, బేకింగ్ పౌడర్, అల్లంవెల్లుల్లి గుజ్జు వేసి బాగా కలపాలి. తరవాత కొద్దిగా నూనె వేడి చేసి పోయాలి. శనగపిండి, బియ్యపిండి కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి గట్టిగా కలపాలి. బాణలిలో నూనె పోసి కాగాక పిండిముద్దను చేతిలోకి తీసుకుని రెల్లుతూ వేసి కరకరలాడేలా వేయించి తీయాలి. ఇవి వారం రోజుల వరకూ నిల్వ ఉంటాయి.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in