|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వేసవిలో:
ప్రతి రోజూ ఉదయాన్నే, పరగడుపున ఒక గ్లాసు మంచినీటిలో నిమ్మరసాన్ని పిండుకొని, అందులో కొద్దిగా
ఉప్పు కలుపుకుని తాగుతుంటే హాయిగా ఉంటుంది.
వేసవిలోచెమట వల్ల చర్మం పేలిపోతూ ఉంటుంది.అటువంటప్పుడు చర్మం పేలిపోకుండా ఉండటానికి స్నానం చేసిన తర్వాత, మంచి గంధాన్ని అరగదీసుకుని చేతులకి, వీపుకి, మెడచుట్టూ, నడుం చుట్టూ రాసుకోవాలి.
స్నానానికి ముందు తులసి ఆకులు, తమలపాకులు రెంటినీ కలిపి దంచుకొని ఆ మిశ్రమాన్ని ఒళ్ళంతా రుద్దుకొని, ఓ ముప్పావు గంట ఆగిన పిదప స్నానం చేయాలి. చెమట కాయల నుండి ఉపశమనం కలుగుతుంది.
పసుపు, వేపాకురసం, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని ఒంటికి పచ్చగా పట్టించుకొని పూర్తిగా ఆరాక ఒక అరగంట ఆగి స్నానం చేస్తే ఒంటి మీదున్న చెమటకాయలు పోతాయి.
వేసవిలో ముదురు వర్ణపు దుస్తులకు బదులుగా లేత వర్ణపు దుస్తులు వాడాలి.
వేసవిలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక ఆహార నియమాలని పాటించాల్సి ఉంటుంది. వేసవిలో నాన్ వెజిటేరియన్ వాడరాదు. ఆకుకూరలు, కాయగూరలు అధికంగా వాడాలి. పండ్లు, పెరుగు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళు, పండ్లరసాలు మేలు చేస్తాయి.
వేసవిలో చల్లదనం కోసం అన్నం వార్చిన పల్చటి గంజిలో కాస్త ఉప్పు కలుపుకొని తాగితే ఫలితం ఉంటుంది.
ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కి ఇడ్లీ, ఉప్మా వంటి తేలిక పదార్ధాలు తీసుకుంటే మంచిది.
ఒక చెంచా తేనె, మూడు చెంచాల పాలు కలిపి మర్దనా చేసి రెండు మూడు గంటల తరువాత చల్లటి నీళ్ళతో కడుక్కుంటే ఎండకు కమిలిన చర్మం తెల్లబడుతుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in