|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఉండ్రాళ్ల తద్దె
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
ఒక ఊరిలో స్త్రీలందరు భాద్రపద బహుళ తదియనాడు వుండ్రాళ్ళ తద్దె నోమును నోచు కొనుచుండిరి. అప్పుడావూరి రాజు గారి వేశ్య కూడా నోము నోచు కొనెదనని రాజుతో చెప్పెను. రాజు "నీకు కావలసిన వస్తువులేవో చెప్పు" మనెను. ఆభోగముది చమత్కారముగ తనకు ఆకూ, గీకూ, కోకా, గీకా, కూరా, గీరా కావలయునని చెప్పెను. అదియెంతపని యని రాజు వాటిని తెచ్చుటకు నౌకరులనుబంపెను. వారన్నింటిని తెచ్చిరిగాని 'గీ'యను పేరుతో నున్న వాటిని తేలేక పోయిరి. ఆ సంగతి రాజు వేశ్యకు తెలుపగా అది నవ్వి, ఇంతేనా మీ రాచబడాయి అని అప్పటికే, ప్రొద్దుపోవుటచే ప్రక్క యింటి ముత్తైదువును బిలచి, అయిదు వుండ్రాళ్ళు గౌరికి నైవేద్యము పెట్టి అయిదు వుండ్రాళ్ళ నా పేరంటాలునకు వాయనమిచ్చెను. అట్లయిదు వుండ్రాళ్ళ నోము నామె నోచుకొని యుద్యాపనమును జేసుకొనెను.
దీనికి వుద్యాపనము
తదియ ముందునాడు తలంటి నీళ్ళు పోసుకొని తదియనాటి తెల్లవారు గట్ల భోజనము జేసి నాటి సాయంత్రము వరకు ఎంగిలి పడకుండ వుండి, చీకటి పడినంతనే గౌరికి అయిదు వుండ్రాళ్ళు నైవేద్యమును పెట్టి యింకొక అయిదు వుండ్రాళ్ళు నొక ముత్తైదువుకు వాయనమియ్యవలెను. అట్లు ఐదు సంవత్సరములు చేసిన పిమ్మట ఐదుగురు పుణ్య కాంతలకు తలంటి నీళ్ళు పోసి గోరింటాకునిచ్చి, వారి కొక్కొక్కరికి ఐదేసి కుడుములను, రవికె గుడ్డలను దక్షిణ తాంబూలములను యివ్వవలెను.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in