|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
పదహారు ఫలముల వ్రతము
ఈ వ్రతము చేయాలనుకునే వారు ఈ కథను చదువుకోవాలి.
రాజుభార్యయు, మంత్రిభార్యయు పదహారుఫలముల నోమునోచిరి. కొంతకాలమునకు వారిరువురకు సంతానము కలిగెను. మంత్రిభార్యకు మాణిక్యముల వంటి బిడ్డలుపుట్టిరి. రాజు భార్యకు గ్రుడ్డివారు కుంటివారు పుట్టిరి. అప్పుడామె మంత్రిభార్యను పిలిపించి తనకిట్టిబిడ్డలు పుట్టుటకు కారణమేమని యడిగెను. అందుకు మంత్రి భార్య "మహారాణీ! మీరు అన్నిరకముల పండ్లను ఒకేసారి తెప్పించి కోట్లలో వేసి ఒకేసారి పంచిపెట్టిరి. వాటిలోకొన్ని వంకర పండ్లుండుటచే నిట్టి సంతానము కలిగె" నని చెప్పి తిరిగి నామెతో నోమును నోయించెను. పిదప నామెకు కూడ సత్సంతానము కలిగెను.
దీనికి వుద్యాపనము
పదహారురకముల పండ్లను యెంచుకొని పిమ్మట నొక్కొక్కజాతి ఫలమును యేరి, ముత్తయిదువులకు పంచి పెట్టవలయును. పూర్తియైనంత సంతర్పణ చేయవలెను.
మూలం: స్త్రీలవ్రత కథలు, మారిశెట్టి నాగేశ్వరరావు, శ్రీ సీతారామా బుక్ డిపో.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in