www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

శ్రీ అనంతపద్మనాభ వ్రతము

ఆచమ్య ప్రాణాయామ దేశకాలమాన, గోత్రనామ ధేయాదీన్ సంస్కృత్య అని సంకల్పము చెప్పుకొని ఈ క్రింది విధముగా పూజ ప్రారంభించాలి.

ఏవంగుణ విశేషణ విశిష్టాయం, శుభతిథౌ, అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాభయ అయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలసిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీమదనంతపద్మనాభ దేవతాముద్దిశ్య శ్రీమదనంతపద్మనాభదేవతా ప్రీత్యర్థం పద్మపురాణోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాంకరిష్యే (నీళ్లు ముట్టుకొవాలి)

అథశ్రీమదనంతపద్మనాభ పూజాకల్పః

ధ్యానం

కృత్వాదర్భమయం దేవం పరిధాన సమన్వితః

ఫణైస్సప్తభిరా విష్ణుం పింగళాక్షంచ చతుర్భుజం

దక్షిణాగ్రకరే పద్మం శంఖం తస్యాప్యథః కరే

చక్రమూర్ధ్యకరే వామే గదాంతస్యాప్యధః కరే||

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం

అవ్యయం సర్వలోకేశం పీతాంబరధరం హరిం

దుగ్ధాబ్ధి శాయనం ధ్యాత్వా చైవమావాహయేత్సుధీః||

శ్రీ అనంతపద్మనాభాయనమః ధ్యానం సమర్పయామి

శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళిః 

1. ఓం అనంతాయ నమః 

56. ఓం దివాకర మునీడతాయ నమః

2. ఓం పద్మనాభాయ నమః 

57. ఓం మధుకవృక్ష సంస్థానాయ నమః

3. ఓం శేషాయ నమః 

58. ఓం దివాకర వరప్రదాయ నమః

4. ఓం సప్తఫణాన్వితాయ నమః 

59. ఓం దక్షహస్తసదాపూజ్యాయ నమః

5. ఓం తల్పాత్మకాయ నమః 

60. ఓం శివలింగనివష్టధియే నమః

6. ఓం పద్మకరాయ నమః 

61. ఓం త్రిప్రతీహారసందృశ్యాయ నమః

7. ఓం పింగప్రసన్నలోచనాయ నమః

62. ఓం ముఖదాపిపదాంబుజాయ నమః

8. ఓం గదాధరాయ నమః 

63. ఓం నృసింహక్షేత్రనిలయాయ నమః

9. ఓం చతుర్‌బాహవే నమః 

64. ఓం దుర్గాసమన్వితాయ నమః

10. ఓం శంకచక్రధరాయ నమః 

65. ఓం మత్స్యతీర్థవిహారిణే నమః

11. ఓం అవ్యయాయ నమః 

66. ఓం ధర్మాధర్మాదిరూపవతే నమః

12. ఓం నవామ్రపల్లవాభాసాయ నమః

67. ఓం మహారోగాయుధాయ నమః

13. ఓం బ్రహ్మసూత్రవిరాజితాయ నమః 

68. ఓం వార్ధితీరస్థాయ నమః

14. ఓం శిలాసుపూజితాయ నమః 

69. ఓం కరుణానిధయే నమః

15. ఓం దేవాయ నమః 

70. ఓం తామ్రపర్ణీపార్శ్వవర్తినే  నమః

16. ఓం కౌండిన్యవ్రతతోషితాయ నమః 

71. ఓం మహతే నమః

17. ఓం సభస్యశుక్లస్తచతుర్థశీ పూజ్యాయ నమః 

72. ఓం ధర్మపరాయణాయ నమః

18. ఓం ఫణేశ్వరాయ నమః 

73. ఓం మహాకావ్యప్రణేత్రే  నమః

19. ఓం సంఘర్షణాయ నమః  

74. ఓం నాగలోకేశ్వరాయ నమః

20. ఓం చిత్‌స్వరూపాయ నమః 

75. ఓం స్వయంభువే నమః

21. ఓం సూత్రగ్రంధి సుసంస్తితాయనమః 

76. ఓం రత్నసింహాసనాసీనాయ నమః

22. ఓం కౌండిన్యవరదాయ నమః 

77. ఓం స్పురన్‌మకరకుండలాయ నమః

23. ఓం పృథ్వీధారిణీ నమః 

78. ఓం సహస్రాదిత్యసంకాశాయ నమః

24. ఓం పాతాళనాయకాయ నమః 

79. ఓం పురాణపురుషాయ నమః

25. ఓం సహస్రాక్షాయ నమః 

80. ఓం జ్వలత్‌రత్నకిరీటాఢ్యాయ నమః 

26. ఓం అఖిలాధరాయ నమః 

81. ఓం సర్వాభరణభూషితాయ నమః

27. ఓం సర్వయోగికృపాకరాయ నమః 

82. ఓం నాగకన్యాప్ద్రత ప్రాంతాయ నమః

28. ఓం సహస్రపద్మసంపూజ్యాయ నమః 

83. ఓం దిక్‌పాలక పరిపూజితాయ నమః

29. ఓం కేతకీకుసుమప్రీయాయ నమః 

84. ఓం గంధర్వగాన సంతుష్టాయ నమః

30. ఓం సహస్రబాహవే నమః

85. ఓం యోగశాస్త్ర ప్రవర్తకాయ నమః

31. ఓం సహస్రశిరసే నమః 

86. ఓం దేవవైణిక సంపూజ్యాయ నమః

32. ఓం శ్రితజనప్రియాయ నమః 

87. ఓం వైంకుంఠాయ నమః

33. ఓం భక్తదుఃఖహరాయ నమః 

88. ఓం సర్వతోముఖాయ నమః

34. ఓం శ్రీమతే నమః

89. ఓం రత్నాంగదలసత్‌బాహవే నమః

35. ఓం భవసాగరతారకాయ నమః

90. ఓం బలభద్రాయ నమః

36. ఓం యమునాతీరసదృష్టాయ నమః

91. ఓం ప్రలంబఘ్నే నమః

37. ఓం సర్వనాగేంద్రవందితాయ నమః

92. ఓం కాంతీకర్షణాయ నమః

38. ఓం యమునారాధ్యపాదాబ్జాయ నమః

93. ఓం భక్తవత్సలాయ నమః

39. ఓం యుధిష్టిర సుపూజితాయ నమః

94. ఓం రేవతీప్రియాయ నమః

40. ఓం థ్యేయాయ నమః

95. ఓం నిరాధారాయ నమః

41. ఓం విష్ణుపర్యంకాయ నమః

96. ఓం కపిలాయ నమః

42. ఓం చక్షుశ్రవణవల్లభాయ నమః

97. ఓం కామపాలాయ నమః

43. ఓం సర్వకామప్రదాయ  నమః  

98. ఓం అచ్యుతాగ్రజాయ నమః

44. ఓం సేవ్యాయ నమః

99. ఓం అస్తీకగురవే నమః

45. ఓం భీమసేనామృత ప్రదాయ నమః

100. ఓం అవ్యగ్రాయ నమః

46. ఓం సురా సురేంద్ర సంపూజ్యాయ నమః

101. ఓం బలదేవాయ నమః

47. ఓం ఫణామణివిభూషితాయ నమః

102. ఓం మహాబలాయ నమః

48. ఓం సత్యమూర్తయే నమః

103. ఓం అజాయ నమః

49. ఓం శుక్లతనవే నమః

104. ఓం వాతాశనాధీశాయ నమః

50. ఓం నీలవాససే నమః

105. ఓం మహాతేజసే నమః

51. ఓం జగత్‌గురవే నమః

106. ఓం నిరంజనాయ నమః

52. ఓం అవ్యక్తపాదాయ నమః

107. ఓం సర్వలోకప్రతాపనాయ నమః

53. ఓం బ్రహ్మణ్యాయ నమః

108. ఓం సజ్వాలప్రళయాగ్నిముఖే నమః

54. ఓం సుబ్రహ్మణ్యనివాసభువే నమః

109. ఓం సర్వలోకైకసంహర్త్రే నమః

55. ఓం అనంతభోగశయనాయ నమః

110. ఓం సర్వేష్టార్థప్రదాయకాయ నమః

ఇతి శ్రీ అనంత పద్మనాభ అష్టోత్తర శతనామావళిః

అనంతపద్మనాభ వ్రతకల్ప కథ

శౌనకాది మహామునులతో సూత పౌరాణికుడు: లోకములలో దారిద్ర్య నివారణమునకు ఒక మహొత్తర వ్రతము కలదు. దానిని చెప్పెద వినుడు అని ఈ విధంగా చెప్పసాగిరి. కాలకర్మవశమున పాండవులు అరణ్యవాస సమయంలో కృష్ణభగవానునితో మహాత్మా! మేము అనేక కష్టాలతో జీవనము సాగిస్తున్నాము. ఈ జీవన మార్గాన్ని తప్పించే తరుణోపాయ మేదైనా ఉంటే చెప్పమని వేడుకున్నారు.

ఓ ధర్మరాజా! పురుషులకు, స్త్రీలకు సకల పాపములను పోగొట్టి సకల సౌభాగ్యములనిచ్చు ఓ వ్రతము కలదు. అదియే అనంతపద్మనాభవ్రతము. భాద్రపద శుక్ల పక్ష చతుర్థీ రోజున చేయవలెను. ఆ వ్రతము వల్ల పుత్ర, పౌత్రాభి వృద్ధియు యశస్సు, సుఖశాంతులు కలుగును అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు "అనంతుడెవ్వరు? అతని స్వరూప మేమిట"ని అడుగగా, ఓ పాండుపుత్రా! అనంతుడు మరెవ్వరో కాదు నేనే. సృష్టి, స్థితి లయ కారకుడను నేనే! కాలగమనమునకు ఆద్యుడను నేనే! నా హృదయాంతరాలలో పదునాలుగు రుద్రులు, అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశాదిత్యులు సప్తర్షులు, భూర్భువ స్వర్గోకాదులు గల నా స్వరూపమును వీక్షించుము అన్నాడు. ఆ మాటలు విని, "ఓ లోకరక్షకా! జనార్దనా! అనంతవ్రతం చేస్తాము ఆ వ్రతము ఎలా చేయాలి ఏ దైవాన్ని పూజించాలి" అని ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుని అడుగగా ఈ విధంగా చెప్పసాగిరి.

కృతయుగంలో సుమంతుడను వేదశాస్త్ర సంపన్నుడయిన బ్రాహ్మణుడు కలడు. వశిష్టగోత్రోద్భవుడయిన సుమంతునకు భృగుమహాఋషి పుత్రిక అయిన దీక్షాదేవితో వివాహమయినది. ఆ దంపతులకు సుగుణరాశియగు పుత్రిక జన్మించినది. ఆ బాలికకు శీల యను పేరు పెట్టారు. కొంతకాలం తరువాత దీక్షాదేవి తాపజ్వరముచే చనిపోయింది. సుమంతుడు కర్కశ అను మరొక కన్యను పెండ్లి చేసుకున్నాడు. ఆమె చాల గయ్యాళి, లోభి. శీల తన తండ్రికి అనుగుణంగా భక్తిశ్రద్ధలతో ఉండేది. కొంతకాలానికి సుమంతుడు తన పుత్రికకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. తపోనిష్టుడగు కౌండిన్యమహాముని సుమంతుని ఇంటికి వచ్చాడు. ఆయనను సుమంతుడు అర్ఘ్య పాద్యాదులతో సత్కరించి, తన కుమార్తె శీలనిచ్చి వివాహం చేశాడు. అల్లునితో కూతుర్ని పంపేటప్పుడు ఏదైనా బహుమతి ఇవ్వాలనుకొన్నాడు. తన భార్యయగు కర్కశను అడిగాడు. ఆమె చిరాకుపడి తలుపులు వేసుకుని "ఏమీలేదు ఇవ్వను పో" అంది. సుమంతుడు చింతించి, ఇంట వెతికాడు. పెండ్లికి చేయబడి మిగిలిన పేలపిండి ఇచ్చి కూతురుని పంపాడు. కౌండిన్యుడు సదాచార సంపన్నురాలు అయిన తన భార్యతో తన యాశ్రమముకు బయలుదేరాడు. మధ్యాహ్న సమయమున మార్గమధ్య మములో బండి ఆపి సంధ్యావందనాది క్రియలు చేయాలనుకొని చెరువు దగ్గరకు వెళ్ళారు. ఆరోజు భాద్రపద శుక్ల చతుర్దశి, స్త్రీలు అంతా ఎర్రని వస్త్రాలు ధరించి భక్తి శ్రద్ధలతో అనంతపద్మనాభ స్వామిని పూజిస్తున్నారు. పరమభక్తురాలైన శీల కూడా ఆ వ్రతమునందు ఆసక్తురాలై వారిని ఆ వ్రతం విషయం అడిగినది. ఈ వ్రతం అనంతపద్మనాభ వ్రతం. ఈ వ్రతం వలన అనంతఫలములు లభించును ఇట్టి మహత్తరశక్తిగల వ్రతం భాద్రపద శుక్ల చతుర్దశి రోజున, నదియందుగాని తటాకమునందు గాని స్నానమాచరించి, శుచియై శుభ్రవస్త్రములు ధరించి పూజ చేయు స్థలమును గోమయముచే అలికి, పరిశుభ్రముగా ఉంచి ఎనిమిది దళములు గల తామరపుష్పం వంటి కుండము నిర్మించాలి. ఆ మండపము చుట్టూ ముగ్గులతో అలంకరించి దక్షిణ పార్శ్వభాగములో కలశము ఉంచి అనంత పద్మనాభ స్వామిని దర్భతో నొనర్చి అందు ఆవాహనం చేసి

కృత్వా దర్భమయం దేవం శ్వేతద్వీపస్తితిం హరిమ్

సమన్వితం సప్తఫణైః పింగళాక్షం చతుర్భుజం||

అను శ్లోకములో ధ్యానం చేసి కల్పోక్త ప్రకారం షోడశో పచార పూజతో ప్రదక్షిణ నమస్కారములు గావించి, పదు నాలుగు నూళ్లు కలిగి కుంకుమతో తడిపిన కొత్త తోరంను ఆ పద్మనాభస్వామికి దగ్గరలో ఉంచి పూజించి గోధుమ పిండితో ఇరువది ఎనిమిది అతిరసములు చేసి నైవేద్యము పెట్టి ఆ తోరమును కట్టుకొని పదునాలుగు అతిరసములు బ్రాహ్మణులకు వాయనదానమునిచ్చి తక్కినవి తాను భుజించాలి. పూజాద్రవ్యములన్నియు పదునాలుగుగా వేసి ఉంచవలెను. బ్రాహ్మణ సమారాధన చేసి అనంత పద్మనాభస్వామిని ధ్యానించుకోవాలి. ఈ విధముగా వ్రతం పరిసమాప్తి గావించి ప్రతి సంవత్సరం ఉద్యాపనం చేసి, మరల వ్రతం ఆచరించాలి అని వారు తెలిపిరి. కౌండిన్యుడు తన భార్య శీలతో స్నానమాచరించినాడు. స్త్రీల సహాయమున శీల వ్రతం ఆచరించి, తోరము గట్టుకొని దారి ఖర్చులకు తండ్రి ఇచ్చిన పేలపు పిండిని వాయనదానమిచ్చి తానును భుజించి, సంతృప్తుడైన భర్తతో బండి ఎక్కి ఆశ్రమముకు వెళ్లారు.

వ్రత ప్రభావం వల్ల ఆశ్రమము స్వర్ణమయముతో ఐశ్వర్య సంపదగల భవంతిగా అయింది. దంపతులిద్దరు ఏ లోటు లేకుండా అతిధి సత్కారములతో సుఖముగా ఉన్నారు. కౌండిన్యుడు ఓ రోజున శీల సందిట నుండు తోరము చూసి ఓ శీల నీవు తోరము కట్టుకొన్నావు గద! అదెందులకు! నన్ను వశము చేసుకొనుటకా లేక మరియొకరి కోసం కట్టుకొన్నావా! అని అడిగాడు.

స్వామీ అది అనంతపద్మనాభస్వామి తోరణము ధరించియున్నాను. ఆ దేవదేవుని అనుగ్రహం వల్ల ఇట్టి సిరి భాగ్యములు కలిగాయి. అన్న శీల మాటలకు కౌండిన్యుడు కోపధారుడై దేవుడిని ధూషిస్తూ తోరమును త్రెంచి భగభగ మండెడు మంటలలో వేసాడు. శీల ఏడుస్తూ పరుగెత్తి ఆ తోరంబును తీసి పాలతో తడిపింది.

కొన్ని రోజులకు వారి సంపద అంతయు బుగ్గిపాలయ్యెను. ఎవ్వరునూ వారితో మాట్లాడలేదు. ధనముంటే గదా! ఆఖరికి బియ్యంగింజ లేక క్షుద్బాధ పీడితులయ్యారు కౌండిన్యుడికి గతమంతా గుర్తుకు వచ్చి, దైవదూషణంవల్ల జరిగింది అని తలచి, మనస్సులో అనంత నామము జపిస్తూ ఒక మామిడి చెట్టు దగ్గరకు వెళ్ళి, "ఓ వృక్షరాజమా! అనంతుడను నామముగల దైవమును చూచినావా" అని అడిగాడు. "అనంతుడెవ్వరో నాకు తెలియదు" అని చెప్పినది.

కౌండిన్యుడు మరికొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక ఏనుగు, గాడిద నిలుచుని ఉన్నాయి వారిని అనంత పద్మనాభ స్వామి గురించి అడిగాడు అవి అనంతుడెవ్వరో తెలియదన్నాయి.

కౌండిన్యుడికి విసుగు, బాధ కలిగి ఓపికలేక మూర్చ పోయి క్రిందపడ్డాడు. కౌండిన్యుని కోసం భగవంతుడు తేజోవంతుడైన వృద్ధరూపమున వచ్చి కౌండిన్యుని తన గృహమునకు తీసుకొనిపోయెను. ఆ గృహము మణులతోను దేవాంగనలతోగూడి యాశ్చర్యము చెందేలా ఉంది. సదాగరుడసేవితుడు, శంఖ చక్రగదాధరుడగు స్వస్వరూపాల్ని పద్మనాభస్వామి చూపించగా, కౌండిన్యుడు సంతుష్టుడై - నమో నమస్తే! గోవిందా నారాయణ జనార్ధనా అని అనేక విధముల స్తోత్రం చేశాడు. అంతట అనంతపద్మనాభస్వామి సంతుష్టుడై ఎన్నడు దారిద్ర్యం రాకుండా, అంత్య కాలమున విష్ణులోక ప్రాప్తికలుగునని వరము ఇచ్చాడు.

దేవాది దేవా! నేను త్రోవలో చూసిన మామిడిచెట్టు, ఆవు, వృషభము, గాడిద, ఏనుగుల వింత ప్రవర్తనకు కారణ మేమిటని అడిగాడు.

ఓ బ్రాహ్మణ శ్రేష్టుడా! పూర్వము ఒక బ్రాహ్మణుడు సకల విద్యలు నేర్చుకొని గర్వంతో విద్యను ఎవ్వరికి చెప్పక పోవడం వలన ఎవ్వరూ ఉపయోగించలేని మామిడి చెట్టుగా జన్మించాడు. తొల్లియొకడు మహాభాగ్యవంతుడై  ఎన్నడూ ఎవ్వరికి ఆఖరికి బ్రాహ్మణులకు కూడా అన్నదానం చేయనందున పశువుగా పుట్టి, పచ్చిగడ్డిలో తిరుగుచున్నాడు. మానవులను ఎల్లప్పుడు దూషణములు చేసినవాడు గాన గాడిద అయినాడు. పెద్దలు చేసి ధర్మము అమ్మినందువలన ఏనుగు అయ్యాడు. ఇవి వారి వారి పూర్వస్థితిగతులు. నీవు పదునాలుగు సంవత్సరాలు అనంత వ్రతము నియమానుసారంగా ఆచరించినచో నీకు నక్షత్ర స్థానము లభిస్తుంది అని అనంతుడు అదృశ్యమయ్యాడు.

కౌండిన్యుడు జరిగినది అంతయు భార్య శీలకు చెప్పి పదునాలుగు సంవత్సరాలు అనంతవ్రతం చేసి ఇహలోకములో పుత్రలతో, పాత్రులతో సంపదలు పొంది నక్షత్రస్థానం పొందాడు.

ధర్మరాజా! కౌండిన్యుడు నక్షత్రమండలంలో ఆ నామమున విరాజిల్లుతూ ఉన్నాడు. అగస్త్య మహాముని ఆచరించి ప్రసిద్ధి పొందాడు.

నగర, దిలీప, భరత, హరిశ్చంద్ర మొదలగు రాజులు వ్రతం చేసి, యశస్సుపొందారు. స్వర్గ ప్రాప్తి కలిగింది. ఈ వ్రతకథను విన్నవారు ఇహలోకమున అష్టైశ్వర్యములతో సుఖముగా ఉందురు. అంతిమకాలంతో పరమపదము పొందగలరు.

మూలం: దైవ దర్శనం, గాజుల సత్యనారాయణ.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in