|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఉడిపి
రజతపురమని పేరు 13వ శతాబ్దం నాటి శ్రీకృష్ణ భగవానుని మందిరం ఉంది. ఇక్కడ మధ్వాచార్యుల వారిచే ప్రతిష్టించబడిన బహు సుందర రూపమైన బాలకృష్ణ స్వామి విగ్రహము కలదు. స్వామి భక్తసులభుడై కనకదాసు అను భక్తుని కరుణించటానికి తూర్పు ముఖంగా ఉండే స్వామి పశ్చిమాభిముఖుడైనాడని ఒక భక్తుని కధ. స్వామిని కనకదాసు ఎక్కడ నుండి చూచాడో అక్కడ మండపం కట్టించి దానికి కనకదాస మండపం అని పేరు పెట్టారుట. స్వామిని అర్చించటానికి ఆచార్యులవారు 8 మఠములు ఏర్పరిచారని అందులో ఉండే యతీశ్వరులే రెండు సంవత్సరాల కొకరుగా వంతుల వారీగా అర్చన చేయటానికి నియోగించబడినట్లుగా చెప్తారు. మారేటప్పుడు పర్యాయోత్సవమని చేస్తారు. యాత్రికలు విశేషంగా పాల్గొంటారు.
దర్శనీయ స్థలాలు
ఇక్కడ దర్శించదగినవి - పవిత్ర వాదిరాజ స్వామివారి సోదెమఠము, శ్రీకృష్ణ మఠము - అందు ఆచార్యుల వారు వాడిన వస్తువుల ప్రదర్శన. దగ్గరిలోని సముద్ర తీరము దర్శించి పవిత్ర స్నానమాచరించుట, మాల్పి, మారవంతె, అంకోలా అనే మూడు బీచిలున్నాయి. సుందర సముద్రతీరంలో దర్శించదగినవి నిదర్శనం వీరి కాలంలో బౌద్ధ, జైన మతాలు కూడా పోషించబడటం, పౌజిక క్షేత్రం - 10 కి.మీ. దూరంలో ఉన్నది. విమానగిరి దుర్గాలయం - అక్కడి మధ్వాచార్యుల వారు స్నానమాడిన నాలుగు తీర్ధములు - మరి కొంచెం దూరం వెళితే గల కోటిలింగాలు గల కోటీశ్వర క్షేత్రం. వగయిరాలతో పాటుగా ఇటీవలే అతి ప్రాముఖ్యమును ప్రచారమును పొందిన...
మూకాంబికా క్షేత్రం
ఉడిపికి ఈశాన్యంగా 80 కి.మీ. దూరంలో ఉన్న పుణ్యక్షేత్రం. మూకాంబికా దుర్గాదేవి
అవతార విశేషమే స్వయంగా ఉద్భవించిన శివలింగము
వెనుక మహతేజస్సుతో విరజిల్లే
దుర్గాదేవిని శ్రీశంకరాచార్యుల వారు స్వయంగా ప్రతిష్టించినది. నవరాత్రుల్లో
మహాసంరంభమైన ఉత్సవాలు జరుగుతాయి. చారిత్రికాభిలాషులకు - ఎంతో ఆసక్తికరములైన చాళుక్య
గుహలు - ఆలయాలు చూడదగినవి ఉన్నాయి. క్రీ.శ. 4
శతాబ్దం వరకు పీఠభూమిని చాలా వరకు తమ
రాజ్యంగా పరిపాలించిన గొప్ప రాజవంశము చాళుక్యరాజవంశము. చాళుక్యల మహా నిర్మాణ దక్షత
ఈ నాటికీ వైభవోపేతమైన శిల్ప సౌందర్యంతో విరాజిల్లే దేవాలయాలు, గుహాలయాలు, పరమ
రమణీయాలై కనువిందు చేస్తున్నాయి. వారి రాజధానులుగా శోభిల్లిన అయిహోల, బాదామి,
పట్టాదకల్ మహోన్నత దశ ననుభవించి ఇప్పుడు మౌన ముద్రను దాల్చినాయి. ఒకసారి వాటివైపు
వెళ్ళి చూద్దాం.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in