|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
హనుమకొండ
వరంగల్లు నుంచి షుమారు 7కిలో మీటర్లుంటుంది. అక్కడి వేయి స్తంభాల మంటపం, ఆలయం అధ్బుత శిల్పసంపదతో నిర్మించబడ్డాయి. ఇది 1162లో పాలించిన రుద్రదేవుని కాలంనాటిది. ఇది చాళుక్య శిల్ప సంపదను సంతరించుకున్న స్తంభాలమీద, దర్వాజాల మీద చూడ చక్కని శిల్పాలున్నాయి. ఆనాటి ఆహరవిహారాదులను కళ్ళకు కట్టినట్లు కనిపించే జానపదుల బొమ్మలు, తరులతాగుల్మాదులు స్తంభాల కలంకారములుగా శోభిల్లాయి. పువ్వురేకుల మడతల్లోనించి సన్ననితీగ, లేక దారంకూడా దూర్చి తీయవచ్చు. ఈ ఆలయంలో నంది నల్లరాతిలో సొంపుగ చెక్కబడింది. మెడ పట్టెడలు వగయిరాలు బహుసున్నితంగా చెక్కబడ్డాయి. శిల్పములు ఒక ఎత్తయితే రెండోవంక ఆలయం గర్భ గుడిలోకి డబల్ వాల్ సిస్టములో ఎయిర్ కండిషండ్ చేయబడినట్లు చల్లటిగాలి మాత్రము తగినంత మేరకు వచ్చునట్లు ఏర్పాటు చేయబడింది. ఇదే ఆనాటి నిర్మాణ కౌశల్యానికి మచ్చుతునక.
వరంగల్లు చేరటానికి హైదరాబాదునుండి వారానికి మూడుమార్లు వాయుదూత్ విమానమార్గముంది. రైలు మీదయితే కాకతీయ ఎక్స్ప్రెస్ రైలు ప్రతిరోజూ వుంది. 4గం.ల ప్రయాణం. విజయవాడ నుండి అయితే కాజీపేట దగ్గిర దిగి కొద్ది కి.మీ. దూరంలో వరంగల్లును చూడవచ్చు. హైదరాబాదు, నిజామాబాదుల నుండి మంచి బస్సు సౌకర్యం కూడా వుంది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in