telugudanam.co.in

      telugudanam.co.in

   

సూక్తులు

 

మొత్తం సూక్తులు - [770 సూక్తులు 52 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

  • 20 ఏళ్ళ అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంధ పఠనం నేర్పుతుంది.
  • అంకెలతో దేన్నయినా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప.
  • అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది.
  • అంతరాత్మ మనలను మందలించె పనులు మనము చెయ్యకూడదు.
  • అంత్య నిష్ఠూరం కన్న ఆది నిష్ఠూరం మేలు.
  • అందం అన్నది సత్యం యొక్క శోభ.
  • అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది.
  • అందమైనది మంచిగా ఉంటుంది. మంచిగా ఉన్నవాడూ త్వరలో అందాన్ని పొందుతాడు.
  • అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో.
  • అందరిపట్ల విధేయత కనపరచండి. కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి.
  • అందానికీ, కళ్ళకీ అవినాభావ సంబంధం ఉంటుంది - ప్రేంచంద్.
  • అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్ళకు కదలిక.
  • అఙ్ఞానం అనేది అభివృద్దికి, మార్పుకు ఎప్పుడూ అడ్డుగోడే.
  • అఙ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది. నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది.
  • అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు.

మొత్తం సూక్తులు - [770 సూక్తులు 52 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: