|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఏకాక్షి (ఒక్క కన్ను కలవాడు)
శుక్రాచార్యుడు. ఈయన రాక్షసులకు గురువు. మృత సంజీవిని విద్య తెలసిన వాడు.
బలి చక్రవర్తి దగ్గరకు వామనుడు వచ్చి 3 అడుగుల భూమి అడిగెను. అంతకంటే అధికమైన వరమును కోరుకొమ్మని బలి చెప్పెను. అప్పుడు శుక్రాచార్యుడు, "ఆ అడుగు చున్నవాడు సామాన్య నరుడు కాడు. వారికేమియు ఇయ్యకుము. ఇచ్చెదని చెప్పి ఈయకున్ననూ ఏ దోషము రాదు. ఆపత్కర సమయములలో అసత్యము చెప్పవచ్చు" అని దానము ఇవ్వవలదని ఎంత చెప్పినా బలి ఆడిన మాట తప్పనని వామనుడడిగిన భూమి ధారపోయుచుండెను. బలికి ఉపకారము చేయటుకై శుక్రాచార్యుడు ఈగగా అవతారామెత్తి నీటి ధార పడకుండా జారీ కొమ్మున అడ్డముగా వచ్చెను. వామనుడు పుల్లతో కొమ్మును కెలికెను. అది ఈగ కంటిలో గ్రుచ్చుకొని కన్ను చితికెను. అందువలననే శుక్రుని నేత్ర మొక్కటి గ్రుడ్డిదయ్యెను. ఆనాటి నుంచి శుక్రాచార్యుల వారికి ఏకాక్షుడు (ఏకాక్షి) అని పేరు వచ్చింది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in