www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

భారతీయ వీరులం

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం

మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం

మాతృదేశ గౌరవం - కాపాడే ధీరులం

శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం

శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం

శాంతి కోరు పాపలం - సమత పెంచు బాలలం

మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం

మేము భావి పౌరులం - త్యాగధనుల వారసులం

వేషభాషలేవైనా - మతాచారమేదైనా

వేషభాషలేవైనా - మతాచారమేదైనా

మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం

మనం భారతీయులం - ఒకే తల్లి పిల్లలం

ప్రపంచాన మన దేశం - ప్రతిభను నిలబెట్టుదాం

మనమంతా సైనికులం - మనం ప్రజా సేవకులం

జాతి స్వేచ్ఛనపహరించు - శత్రువునెదిరించుతాం

విజయం సధించుతాం - జయపతాక నెగరేద్దాం

విజయం సధించుతాం - జయపతాక నెగరేద్దాం

హిమశైల కిరీటయై - సముద్ర పాద పీఠయై

గంగ, యమున, గోదావరి - కృష్ణ వేణి సహితయై

విలసిల్లే భరతమాత - మన తల్లికి జోహార్

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం

భారతీయ వీరులం - భరతమాత బిడ్డలం

ప్రపంచ బాలలగీతి

ఎల్లలెరుగని వాళ్ళము - కల్లలెరుగని వాళ్ళము

బాలలం మేమొక్కటే - లోకమూ మాకొక్కటే

గోధుమరంగున కొందరు - పసుపు వెన్న ఇంకొందరు

తెలుపు, నలుపు, ఆపిల్ ఎరుపూ

ఏ రంగైనా ముచ్చట గొలుపూ

రంగేదైనా రూపేదైనా - నివసించే ఆ చోటేదైనా

బాలలం మేమొక్కటే - లోకమూ మాకొక్కటే,

అన్నం, పప్పు, చారు, కూర - శాకాహారం అనువారైతే

గుడ్డూ, చేపా, కోడీకురా - మాంసాహారం అనువారైతే

తిండేదైనా, తీరేదైనా - తినగోరే ఆ రుచులేవైనా

బాలలం మేమొక్కటే - లోకమూ మాకొక్కటే

అవునందురు, ఎస్ అందురు కొందరు

ఒకే, టాటా అందురు కొందరు

సీ, దేఖో, జా అంటూ కొందరు

పలు విధాలుగా పలుకుచుందురు

మాటేదైనా, పాటేదైనా - పెదాలు కలిసే భాషేదైనా

బాలలం మేమొక్కటే లోకమూ మా కొక్కటే

దేశాల్ వేర్వేరైనా కానీ - సందేశం మాదిదే

యిదే సంతోషంతో సకల ప్రపంచం - పకపకలాడాలన్నదే

వెలుగులు...

గోరంత దీపం కొండంత వెలుగు

మా ఇంటి పాపాయి మా కంటి వెలుగు

వెచ్చని సూరీడు పగలంతా వెలుగు

చల్లని చంద్రుడు రాత్రంతా వెలుగు

ముత్యమంత పసుపు ముఖమంత వెలుగు

ముత్తైదు కుంకుమ బ్రతుకంత వెలుగు

గురువు మాట వింటే గుణమంత వెలుగు

మంచి చదువులు నీకు భవిష్యత్తు వెలుగు

ఏనుగమ్మ ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్దది ఏనుగు

నాలుగు కాళ్ళ ఏనుగు - చిన్నితోక ఏనుగు

చేట చెవుల ఏనుగు - చిన్ని కళ్ళ ఏనుగు

తెల్ల దంతపు ఏనుగు - పొడవు తొండం ఏనుగు

ఏనుగమ్మ ఏనుగు - ఎంతో పెద్దని ఏనుగు

చిన్నారి పాట

పాడుబడిన కోట - కోట వెనుక పేట

పేట వరకు బాట - బాట పక్క తోట

తోటలోన మోట - మోట కోసం రాట

రాట తిరుగుచోట - రాగాల పాట

పాట పాడునోట - పంచదార ఊట

అందుకే పూట పూట - వినిపించు పాట

చిన్నారి నోట - ఓ కొత్తపాట

చుట్టాల సురభి

చుట్టాల సురభి - బొటన వ్రేలు

కొండేల కొరవి - చూపుడు వ్రేలు

పుట్టు సన్యాసి - మధ్య వ్రేలు

ఉంగరాల భోగి - ఉంగరపు వ్రేలు

పెళ్ళికి పెద్ద - చిటికెన వ్రేలు

తిందాం తిందాం - ఒకవేలు!

ఎట్లా తిందాం - ఒకవేలు!

అప్పుచేసి తిందాం - ఒకవేలు!

అప్పెట్టా తీరుతుంది - ఒకవేలు!

ఉన్నాగదా నేను అన్నింటికీ

పొట్టివాణ్ణి గట్టివాణ్ణి బొటనవేలు!


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in