www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

బాల శిల్పులు

ఎవరా పనివా

ళ్ళెవరా శిల్పులు?

ఏమా పనితన

మేమా సరదా!

ఏవీ ఇటుకలు

ఏవీ తలుపులు,

చువ్వలు, గుమ్మా

లేవీ? లేవే!

వానకు తడిసిన

ఇసుక తిన్నెపై

కెట్లా అందరు

ఎగబడ్డారో!

మాటల నడుమా

పాటల నడుమా

ఎంత చురుకుగా

పని చేశారో!

ఇట్టే ఇట్టే

చక్కని ఇళ్ళను

ఎంత తీరుగా

కట్టేశారో!

అవిగో, అవిగో

అందాలోలికే,

ముచ్చట గొలిపే

పిచ్చుక గూళ్ళు.

తూ తూ తూనీగా

తూతూ తూతూ తూనీగా

ఎగురలేము నీలాగా.

నీవు తిరుగు తున్నావంటే

వాన మాకు వచ్చే మాటే.

నీ రెక్కల అమరికలోనే

నీ కబ్బును నేరుపు తానే.

వాని వింత పోకడ లందే

మెలకువ లెన్నో తోచుగదే.

నీ రంగుల ఈ సింగారం

పొంద గలుగునా బంగారం

రాలుగాయి పిల్ల లెందుకే

చెనకుతారు నిన్ను ఊరకే

తాడు కట్టి ఎగరేస్తారే

రెక్కలూడ పీకేస్తారే

నీ నేరం ఏమంటారో

తమ బుద్దుల తీరంటారో!

ఎంతపెద్దదొ !

ఎంత పెద్దదొ

ఎంత పెద్దదొ

ఏనుగంటే

ఎంత పెద్దదొ !

ఎద్దుకన్నా

 చాల పెద్దది

ఎనుము కన్నా

కూడా పెద్దది.

చెవులు చూస్తే

చేట లంతవి

కాళ్ళు చూస్తే

బోదె లంతవి.

కొండ చిలువే

దాని తొండం

వెండీ విలువే

దాని దంతం

కళ్ళు మాత్రం

చిన్న చిన్నవి

మెదడు కూడా

చిన్నదేలే

దాని తొండం

పాటి చెయ్యని

మనిషి కందుకె

లొంగి ఉన్నది.

ఇల్లు

ఎండ వేడిమి

సోక నీయదు

వాన నీటను

తడువ నీయదు.

గాలి తాకిడి

కలుగ నీయదు

దుమ్ము ఒంటిని

తాక నీయదు.

గొడ్డు గోదా

చేర నీయదు.

దొంగ ఇంట్లో

దూర నీయదు.

ఇల్లు తల్లిని

మరువ నీయదు.

ఈ చక్కని లోకం

ఎంత చక్కనిది ఈ లోకం

ఎందుకోయి ఇంకొక లోకం

కళ కళ లాడే సూర్యుడు, చంద్రుడు

మిల మిల మెఱసే చుక్కల గుంపులు

తళ తళ లాడే మెఱపు తీవలూ

కావటోయి అవి మనకోసం?

జలజల పాఱే ఏఱులు, నదులూ

తెలితెలి నురువుల సంద్రపు టలలూ

నవ నవ లాడే పచ్చని కోనలు

లేవటోయి అవి మనకోసం?

ఘుమ ఘుమలాడే పూ పొదరిండ్లూ

గుసగుసలాడే తరువులు, లతలూ

అలనల వీచే పిల్ల తెమ్మెరలు

ఎవరికోయి అవి? మనకోసం.

బడాయి పిల్లి...

బడాయి పిల్లి లడాయికెళ్ళి

ఎలుకను చంపి ఏనుగె అంది

పులినే తానని పొంగిన పిల్లి

కుక్కను చూసి ఒక్కటే పరుగు

మా బావ వీరుడు - మంచం దిగడు

చీమంటే చాలు - చిందులేస్తాడు

ఎలుకలంటే చాలు - ఎగిరి పడతాడు

పిల్లి అంటే చాలు - పారిపోతాడు.

తిందాం తిందాం

తిందాం తిందాం - ఏం తిందాం?

అప్పలు తిందాం - పప్పులు తిందాం

అన్నం, కూరలు - పెరుగూ, పచ్చడి

అన్నీ తిందాం - ఆంబుక్క!


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in