www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

పిల్లల పాటలు (కొన్ని)

ఒకటి ఒకటి రెండూ...

ఒకటి ఒకటి రెండూ - వేళకు బడికి రండు

రెండు ఒకటి మూడూ - ఒకరికి ఒకరం తోడు

మూడు ఒకటి నాలుగు - కలిసి మెలసి మెలుగు

నాలుగు ఒకటి ఐదు - చెడ్డవారికి ఖైదు

ఐదు ఒకటి ఆరు - న్యాయం కోసం పోరు

ఆరు ఒకటి ఏడు - అందరి మేలు చూడు

ఏడు ఒకటి ఎనిమిది - భారతదేశం మనది

ఎనిమిది ఒకటి తొమ్మిది - కమ్మని మనసు అమ్మది

తొమ్మిది ఒకటి పది- చదువే మనకు పెన్నిధి

కలసిఉందాం

అమ్మ అప్పచ్చి

కమ్మనప్పచ్చి

కోరితెచ్చాను

చేరి తిందాము

సగము నీకు

సగము నాకు

వద్దనబోకు - కద్దనబోకూ

కలసితిందాం - కలిసిఉందాం

కాకి కాకి

కాకి కాకి గువ్వల కాకి - కాకి నాకూ ఈకా ఇచ్చె

ఈకా తెచ్చి దిబ్బకు ఇస్తే - దిబ్బానాకూ ఎరువూ ఇచ్చె

ఎరువూ తెచ్చీ చేలో వేస్తే - చేనూ నాకూ గడ్డీ ఇచ్చే

గడ్డీ తెచ్చి ఆవుకు ఇస్తే - ఆవూ నాకూ పాలు ఇచ్చే

పాలూ తెచ్చీ పంతులు కిస్తే - పంతులు నాకూ పాఠం చెప్పే

కాళ్ళాగజ్జ - కంకాలమ్మ

కాళ్ళాగజ్జ - కంకాలమ్మ

వేగుచుక్క - వెలగ మొగ్గ

మొగ్గ కాదు - మోదుగ నీరు

నీరుగాదు - నిమ్మల వాయ

వాయగాదు - వాయింటకూర

కూరగాదు - గుమ్మడిపండు

పండుగాదు - పాపడమీసం

మీసంగాదు - మిరియాలపోతు

పోతుగాదు - బొమ్మలశెట్టి

శెట్టిగాదు - శామమన్ను

మన్నుగాదు - మంచి గంధపుచెక్క

లింగులింటుకు - పందెల పటుకు

కాలు పండినట్లు - కడకు దీసి పెట్టు.

గుండు సున్న...

వానవచ్చి వాగులు పారె

కోడి వచ్చి గుడ్డు పెట్టె

తాత వచ్చి తొంగిచూసె

అవ్వ వచ్చి గుడ్డు తీసె

అమ్మ వచ్చి అట్టు వేసె

అన్న వచ్చి గుటుక్కునమింగె

నాకు మాత్రం గుండు సున్న

గుడు గుడు కుంచం...

గుడు గుడు కుంచం గండే రాగం

పాముని పట్నం పడిగే రాగం

అప్పడాల గుఱ్ఱం ఆడుకోబోతే

పే పే గుఱ్ఱం పెళ్ళికిపోతే

అన్నా! అన్నా! నీ పెళ్లెపుడంటే

రేపుగాక ఎల్లుండి

కత్తిగాదు బద్దాగాదు గప్,చిప్


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in