telugudanam.co.in

      telugudanam.co.in

   

 

హాస్య సంపద - [620 జోకులు 42 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

  • 25 సంవత్సరాలు
    ఓ దంపతులు తమ వివాహ రజితోత్సవం జరుపుకోవాలని అనుకున్నారు.
    భార్య  ఏమండీ మన రజితోత్సవం రోజున మీరు విదేశాలనుండి తెచ్చిన కోడిని పలావు వండుకుందామా! 
    
    భర్త  ఎప్పుడో 25 సంవత్సరాల క్రితం జరిగిన తప్పుకి పాపం ఆ కోడినెందుకు బలివ్వడం! అన్నాడు జాలిగా!


  • 5 ఈగలు
    రాజు నేను నిన్న 5 ఈగలను చంపాను.
    అందులో మూడు మగ రెండు ఆడ. 
    సోము  అదెలా తెలుసు నీకు 
    రాజు  మూడు ఈగలు షేవింగ్ బాక్స్ మీద రెండు ఈగలు లిప్‌స్టిక్ మీద వాలాయిగా.


  • 5000 రూపాయల...
    మిస్టర్ సుబ్బారావు: ఏమేం షాపింగ్ చేశావు?
    మిసెస్ సుబ్బారావు: పెద్దోడికి బట్టలు, చిన్నోడికి బూట్లు, అమ్మాయికి గాజులు, పని అమ్మాయికి చీర తెచ్చాను 
    మిస్టర్ సుబ్బారావు: మరి నా కోసం ఏం తెచ్చావు? 
    మిసెస్ సుబ్బారావు: 5000 రూపాయల బిల్ తెచ్చాను.


  • అంతే!
    రవి మీ నాన్నగారి వయసెంతరా
    వాసు  నా వయసెంతో అంతే. 
    రవి  అదెలా 
    వాసు  నేను పుట్టినప్పుడే ఆయన నాన్నయ్యారు.


  • అందంగా వున్నానా?
    ఈ స్వెట్టర్‌లో నేను అందంగా వున్నానా?
     ఫర్లేదులే. . . 
      అదేంట్రా అలాగంటావు?
     ఈ స్వెట్టర్‌ నీ వంటి మీద కంటే గొర్రె వంటి మీద ఊలు రూపంలో వుంటే ఇంకా అందంగా వుండేది. . .


  • అందమైన వేళ
    ఇంత అందమైన సాయంత్రాన్ని ఇలా తాగుతూ గడుపుతావెందుకు. బయట ప్రకృతి ఎంతందంగా వుందో చూడు అన్నాడు రమేష్.
    కొన్నివిషయాలు చెప్పలేం అన్నాడు సురేష్. 
    నీకు అంత విచారాన్ని కలిగించిన విషయమేమిటి? 
    లేదు. విచారం కాదు. నేను చాలా సంతోషంగా వున్నాను మరి ఈ తాగుడేమిటి? నేను చాలా ఆనందంగా వున్నాను. నాకు సంతోషాన్ని కలిగించింది ఈ సాయంత్రమే. 
    నిన్న సాయంత్రం నా భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది. అందుకే తాగుతున్నాను అన్నాడు సంతోషంగా సురేష్.


  • అందుకే తక్కువ చదివి
    తండ్రి ఒరేయ్‌ బడుద్ధాయ్! నీ చదువు కోసం ఎంత డబ్బు తగలెయ్యాల్సి వస్తోందో నీకేమైనా ఒళ్ళూ పై తెలుస్తోందా?
    కొడుకు  తెలుస్తోంది డాడీ! అందుకే నేను చాలా తక్కువ చదివి నీకు ఖర్చు అవకుండా చూస్తున్నాను.


  • అగ్నిప్రమాదం
    ఒక ప్రముఖ హీరోని ఇంటర్వ్యూ చేస్తూ విలేఖరి అడిగాడు. సర్‌ మీరూ మీ శ్రీమతికి అభిప్రాయభేదాలు వస్తూ ఉంటాయా?
    హీరో  ఆ! ఎందుకు రావు వస్తాయి. అయితే ఒకసారి మాత్రం ఎటువంటి అభిప్రాయభేదం రాలేదు! 
    విలేఖరి  ఎప్పుడు? 
    హీరో  అదే మా ఇల్లు ఒకసారి అగ్నిప్రమాదానికి గురైతే, ఇద్దరం హెల్ప్‌, హెల్ప్‌ అంటూ కలిసే అరిచాం!


  • అచ్చొచ్చిన రాయి
    నీకు అచ్చొచ్చిన రాయి ఏమిటని అనడిగితే పచ్చడి బండ అంటావేమిటే మొద్దూ? స్నేహితురాలిని ఆశ్చర్యంగా అడిగింది రమ.
    మొద్దునేం కాను. ఆ పచ్చడి బండ కాలికి తగిలి పడిపోయేగా మా అత్తగారు టపా కట్టింది. అందుకనీ.. అంది ఉమ.


  • అడుగుజాడల్లో నడుస్తా
    నేను పెద్దయ్యాక పోలీసయ్యి మా నాన్న అడుగుజాడల్లో నడుస్తా. . .
     మీ నాన్న పోలీస్‌ కాదుగా! 
     అవును. . . మా నాన్న పెద్ద గజదొంగ. . .


  • అతిథి సత్కారం
    మా ఇంటికి ఎవరు వచ్చినా ఒక్క పూటకు మించి ఉండరు తెలుసా?
    ఎందుకని? 
    ఆ వచ్చిన చుట్టాలనే కాఫీపొడి పంచదార మొదలైనవన్నీ అరువు తెమ్మని పక్కింటికి పంపితే..


  • అదే నేనైతే
    ఒకరైల్వే కంపార్ట్‌మెంట్‌లో రాజు రాధ కూర్చొని వున్నారు. రాజు పేపరు చదువుకుంటూ సిగరెట్ కాలుస్తున్నాడు. అది చూసిన రాధ కోపంగా లేచి నిలబడి నువ్వే కనుక నా భర్తవి అయితే టీలో విషం కలిపి ఇచ్చేదాన్ని అంది.
    నువ్వే కనుక నా భార్యవి అయితే ఆ టీని తాగేసే వాడిని అన్నాడు రాజు.


  • అదే శాస్తి
    రైలుబోగీలో ఇద్దరు స్త్రీల మధ్య కిటికీ విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది.
    ఇదుగో! ఆ కిటికీ తెరవడానికి వీల్లేదు. చల్లగాలికి నాకు జ్వరం వచ్చి చచ్చిపోతాను. గట్టిగా అరిచింది మోదటి మహిళ. 
    కిటికీ మూసి ఉంచి, ఈ ఉక్కపోతలో చావడానికి నేను సిద్ధంగా లేను అంతకంటే బిగ్గరగా చెప్పింది రెండో మహిళ. 
    అప్పుడే అటుగా టీసీ వచ్చాడు. వాళ్ళ గొడవంతా విని ఏమీ చేయలేక అయోమయంలో పడ్డాడాయన. 
    ఆ బోగీలోనే ప్రయాణిస్తున్న ఒకాయన టీసీతో ఇలా చెప్పాడు. ముందు కాసేపు కిటికీ తెరిచి పెడదాం. మొదటామె చచ్చిపోతుంది. తర్వాత మూద్దాం. రెండో ఆవిడాపోతుంది. అప్పుడు మనం ప్రశాంతంగా ప్రయాణం చేయ్యొచ్చు.
    
    


  • అదేవిధంగా నా గుండెనొప్పి..
    డాక్టరు (కోపముతో) మీరు నాకు ఇచ్చిన చెక్కు మంచిచెక్కు కాదు. అది తిరిగి వచ్చింది.
    రోగి అలాగా! అయితే నాగుండె నొప్పి కూడా నా చెక్కులాగే తిరిగి వచ్చింది. మరి దాని సంగతేమిటి?


  • అద్దె
    సురేష్: అయిదేళ్ళ నుంచి నువ్వు ఇంత బాగా పనిచేస్తున్నా మీ బాస్ నీకు జీతం ఎందుకు పెంచలేదు.
    రమేష్: ఏమో తెలీదు 
    సురేష్: నువ్వు ఎప్పుడూ అడగలేదా? 
    రమేష్: అడగలేదు 
    సురేష్: ఎందుకు? 
    రమేష్: నేను వాళ్ళ ఇంట్లో అద్దెకు ఉంటున్నాను, జీతం పెంచమంటే అద్దె కూడా పెంచమంటారని.
    
    


హాస్య సంపద - [620 జోకులు 42 పుటలలో ]      1 2 3 4 5 6 7 8 9 10 > >>  

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: