telugudanam.co.in

      telugudanam.co.in

   

రక్తము

18 మరియు 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి సగటున 45 కి.గ్రా.లు భారంతూగే ప్రతీ ఆరోగ్యవంతమైన వ్యక్తి పురుషుడు మూడేసి మాసాలకొకసారి, స్త్రీ నాల్గేసి మాసాల కొకసారి నిర్భయంగా రక్తదానం చేయవచ్చు. మన శరీరంలో 4.5 మొదలు 5.5 లీటర్లు రక్తం ప్రవహిస్తుంది. దీంట్లో ప్రతీసారీ 10 శాతం అంటే (450-550సిసి) రక్తం దానం చేయవచ్చు.

దానం చేసిన రక్తంలో ద్రవరూపమైన పదార్ధాలు శరీరంలో 10 లేక 12 గంటలలో ఉండే కణాలు మాత్రం 4 మొదలు 14 రోజులలో భర్తీ అవుతాయి. ఈ కాలవధిలో దీనివల్ల శరీరానికి ఎటువంటి బాధ కలుగదు. రక్తదానం చేసిన తరువాత ఒక రోజు అధికంగా నీరు తాగమంటారు. రక్తదానం వల్ల మీ ఆయువు క్షీణించదు. ఇతర బాధలు ఉండవు.

సక్రమంగా రక్తదానం చేస్తూండటంవల్ల శరీరంలో క్రొత్త రక్తం ఏర్పడడానికి ఉత్తేజం కలుగుతుంది. రక్తంలో కొలెస్టరాలు విలువ తగ్గుతుంది. ఇంతేగాక రక్తం చిక్కదనం బాగా తగ్గుతుంది. అందువల్ల గుండెపోటు, సెరిబ్రల్ హెమరేజ్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

రెడ్ బ్లడ్ కార్పసల్ సగటు జీవితకాలం 110 మొదలు 112 రోజులు. తరువాత ఇవి శరీరంలో నశించిపోతాయి. వాటిస్థానే క్రొత్తవి చేరతాయి. ఇది క్రమ విధానంలో ప్రాణం ఉన్నంతవరకూ జరుగుతూంటుంది. కాబట్టి మీరు రక్తదానం చేసినా చేయకపోయినా శరీరంలో ఎర్ర రక్తకణాలు నశించిపోతూంటాయి. తిరిగి ఏర్పడుతూంటాయి. ఈ విధంగా శరీరంలో సహజంగా నశించిపోవడానికి బదులు 3 లేక 4 మాసాలకొకసారి రక్తదానం చేస్తే అవసరమైన వారికి ప్రాణభిక్ష పెట్టిన పుణ్యం లభిస్తుంది.

భారతదేశపు వాతావరణంలో రక్తం 2 మొదలు 3 డిగ్రీల సెంటేగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 21 రోజులు నిలవ చేయవచ్చు. అవసర పరిస్థితులను ఆదుకోడానికి ప్రతీ బ్లడ్ బేంక్‌లో ఆయా గ్రూపులకు చెందిన రక్తం కొంత నిలవ ఉండాలి. రక్తదానం చేసేవారి రక్తాన్ని గ్రహించి దానిని శుద్ధిచేసి ఏ గ్రూపుకు సరిపోతుందో సరిచూసి ఎక్కించడానికి 2 లేక 2 1/2 గంటల కాలం పడుతుంది.

పశ్చిమ దేశాలలో 120 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర రక్తాన్ని 12 సంవత్సరాల దాకా నిలువ చేయవచ్చు. అక్కడ అపురూపమైన బ్లడ్ గ్రూప్‌కు చెందిన జనం సక్రమంగా కొద్దికొద్దిగా రక్తదానం చేస్తూంటారు అవసరమైనప్పుడు అనువుగా ఉపయోగించుకోడానికి వారి పేరున నిల్వ ఉంచుతారు. 16మొదలు 60 సంవత్సరాలమధ్య వయస్సుగల పురుషులు, స్త్రీలు 2 మాసాలకు ఒకసారి 400 మొదలు 500సిసి రక్తాన్ని దానం చేస్తూంటారు. పూర్తిగా, రక్తం ఎప్పుడోగాని ఎక్కించరు. దాంట్లో ఉండే ప్లాస్మా, ఎర్రకణాలు, తెల్లకణాలు, ప్లేట్ లేట్స్ వేరు పరుస్తారు.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: